పవర్ బాబీ బాగా తీసాడు

Screen Shot 2016-03-17 at 4.16.03 PM

గబ్బర్‌సింగ్-1 హరీష్‌శంకర్ ఇరగదీసేసాడు. పవన్‌కల్యాణ్ ఏమి కోరుకున్నాడో, దానికి పదింతలు ఇచ్చాడు. పవన్‌కల్యాణ్ ఒక రకంగా వూహించుకుంటే, హరీష్‌శంకర్ ఇంకో రకంగా ఇచ్చి సన్సేషన్ క్రియేట్ చేసాడు. “నాకు తిక్కుంది .. కాని దానికో లెక్కుంది” అనే చిన్న డైలాగ్‌తో అంచనాలు ఎక్కడికో తీసుకెళ్ళిపొయాడు. కాకపొతే తను చెప్పిందొకటి, హరీష్‌శంకర్‌కు అర్దం అయ్యిందొకటని పవన్‌కల్యాణ్ ఫీల్ అయ్యి, తనే కూర్చుని “సర్దార్ గబ్బర్‌సింగ్” వ్రాసుకున్నాడు.

సర్దార్ గబ్బర్‌సింగ్ కూడా హరీష్‌శంకర్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. వేరే దర్శకుడిని ఊహించుకోలేకపొయారు. హరీష్‌శంకర్ కూడా ఒక లైను అనుకున్నాడు. పవన్‌కల్యాణ్ దాకా తీసుకెళ్ళలేకపొయాడో, లేక రెమ్యూనరేషన్ ఎక్కువ చేసాడో, లేక మరెదో కారణమో, పవన్‌కల్యాణ్ వేరే దర్శకుడిని ఎంచుకున్నాడు. కథ-కథనం పవన్‌కల్యాణే అందిస్తూ, డైరక్షన్ మాత్రం పవర్ బాబీ చేతుల్లో పెట్టాడు.

పవర్ బాబీ బాగా తీసాడు. షాట్స్ బాగా ఎక్సికూట్ చేసాడు. పిల్లలతో పరిగెత్తే సీన్ హైలట్ అయితే(పిల్లలందరూ భలే నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ చేసినట్టు వున్నారు), జబర్దస్థ్ గ్యాంగ్ పూలు జల్లుతుంటే పవన్‌కల్యాణ్ వేసే తీన్‌మార్ స్టెప్ కేకలకే కేక పుట్టించేట్టు వుంది. ఈ రెండు మాత్రమే, ప్రతి ఫ్రేము బాగా తీసాడు. చాలా రిచ్ లుక్ వుంది, టేకింగ్లో పరఫక్షన్ వుంది.

గబ్బర్‌సింగ్ తో మంచి ప్లాట్ ఫార్మ్ సెట్ చేసినందుకు Thanks Harish Shankar .. and సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాను హరీష్‌శంకర్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా తీసినందుకు, Thanks to Power Bobby.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *