పోరాటానికి సిద్ధం

Pawan Kalyan

ఈ రోజు మీడియా వార్తలు ప్రకారం(అం.ప్ర) ప్రభుత్వం,రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు మీద భూసేఖరణ చట్టం ప్రయోగించనున్నట్టు హైకోర్టుకి తెలిపారు.

ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి సిద్ధంగా వున్నాను.

—పవన్‌కల్యాణ్

  1. జీవనాధారం అయిన పంట భూమిని రాజధానికి ఇవ్వడం అనేది చాలా పెద్ద త్యాగం.
  2. పంట భూమిని రాజధానికి ఇవ్వడం అనేది కూడా చాలా పెద్ద త్యాగం.
  3. భూమిని రాజధానికి ఇవ్వడం అనేది కూడా చాలా పెద్ద త్యాగం.

డబ్బు కోణంలో ఆలోచిస్తే త్యాగం కాదు, పెద్ద వెర్రితనం. ఎందుకంటే తమకు వున్న సగం భూమిని అమ్మేసుకొని, సగం భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తే అటు డబ్బులు వస్తాయి. అటు ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలాలు అందుతాయి.

సమస్య ఏమిటి?
రెండు రకాల జనాలు వున్నారు.

  1. ప్రాణాలైన వదులుకుంటాం కాని, భూమిని వదులుకోలేం అనే మూర్ఖత్వం. భూమి మీద పెంచుకున్న మమకారం.
  2. భూమి మన దగ్గరే వుంచుకుంటే ఇప్పుడు వచ్చే దానికంటే ఇంకా ఎక్కువ వస్తుందనే ఆశ. వ్యాపారం.

రాజధానికి స్వచ్చంధంగా భూమిని ఇచ్చిన వాళ్ళు నిజంగా ధన్యులు.
వ్యాపార కోణంలో భూమిని కొనుక్కొని భూమిని ఇచ్చిన వాళ్ళు కూడా ధన్యులే.

ఇవ్వని వాళ్ళను తిట్టవలసిన పని లేదు. ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి.

వాళ్ళపై భూసేఖరణ చట్టం అమలు చేస్తే పొరాటానికి సిద్ధం అంటున్నాడు పవన్‌కల్యాణ్.

Bottom line:
నెక్స్ట్ మూవీ త్వరలో మొదలవ్వబోతుందని నిన్నే న్యూస్ వచ్చింది. ఇంతలో ఈ ట్విట్.

లక్కీ రవితేజ!!!

Filed Under: Pawan KalyanTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *