పోరాడాల్సింది కేంద్రంతో

image

అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించిన సంపాదనను ఎవరైనా ప్రశ్నిస్తే “ఏ రాజకీయ నాయకుడు దోచుకోలేదు?” అని తిరిగి ప్రశ్న వస్తుంది తప్ప, రాజకీయంగా దోచుకోవడం తప్పు అనటం లేదు.

దోచుకున్న వాళ్ళకు , ఆ కులానికి చెందిన ఆ వర్గానికి చెందిన చదువుకున్నోల్లు సపోర్ట్ కూడా పుష్కలంగా వుంది. అంతలా భ్రష్టు పట్టించేసారు మన నాయకులు.

డబ్బులతో ఓట్లు కొనేసి ప్రజలకు హక్కులు లేకుండా చేసేసారు.

అన్యాయం కోసం పోరాడాల్సిన నాయకులు, పోరాడితే ఎక్కడ సి.బి.ఐ అంటారో అని భయం. గెలవడానికి చేసిన ఖర్చు సంపాదించు కోలేమోనని బెంగ.

తెలంగాన ప్రజల ఆకాంక్ష మేరకు అడ్డగోలుగా విభజన చేసారు సరే.

రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు చేసిన ప్రామిసెస్ మాట ఏమిటి? కేంద్రంతో పోరాడవలసిన సమయం వచ్చింది.

పవన్ కళ్యాణ్ కు స్పష్టత వుంది కాని, టైం లేదు.

Filed Under: Pawan KalyanFeaturedTelugu