ప్రజలు – నిస్సాహాయులు .. Please question leaders and Political leaders

Pawan

కాపుల ఉద్యమం, హింసాత్మక ఘటనలపై రేపు పవన్ కళ్యాణ్ స్పందించనున్నారు..కేరళలో షూటింగ్ లో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ షూటింగ్ నిలిపివేసి హైదరాబాద్ పయనమైనట్లు సమాచారం..ఉద్యమం హింసాత్మకంగా మారడంపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది..

  1. అందరూ కలిసి అభివృద్ది కోసం పాటుపడవలసిన సమయంలో, కులం ముసుగులో మన ఆస్తులను మనమే ధ్వంసం చేసుకునే సంఘటనలు జరగడం విచారకరం, దురదృష్టకరం.
  2. ఈ దురదృష్టకరమైన సంఘటన ద్వారా రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకులను సమర్ధిస్తున్న మేధావులు వుండటం ఇంకా దురదృష్టం.. నీచం కూడా.

జనసేన లక్ష్యం అధికారం కాదు, కాబట్టి ఏమి చేసినా రాజకీయ లబ్ధి కోసం కాదు. జనసేన & పవన్‌కల్యాణ్ అభిమానులు, పవన్‌కల్యాణ్ స్పందనను రాజకీయ లబ్షి కోసమో, పవన్‌కల్యాణ్‌ను హిరో చెయ్యడానికో వాడుకోకండి. వాడుకొనే ప్రయత్నం చేస్తే, రాజకీయ నీచులకు, మేధావి నీచులకు, జనసేన & పవన్‌కల్యాణ్ అభిమానులకు తేడా వుండదు. ప్రశాంత జన జీవనమే జనసేన ధ్యేయం.

Please question leaders and Political leaders:
ఆందోళన కారులను కాల్చి పాడేయటమో, నానా ఇబ్బదులకు గురి చేయటమో అసలు సమస్యకు పరిష్కారం కాదు. సమస్య సృష్టికర్తలను, ప్రజలను రెచ్చగొట్టే వాళ్ళను ప్రశ్నించాలి.

  1. సృష్టికర్త చంద్రబాబు. స్పష్టత లేని హమీలు, వాగ్దానాలు ఎందుకు చెయ్యాలి? ..అమలు పరచకుండా, అమలు చేసినట్టు ప్రచారం చేసుకొవడం దేనికి?
  2. ముద్రగడ పద్మనాభం. తెలియక చేసిన తప్పు అయినా, బాద్యతతో వ్యవహరించవలసిన అవసరం వుంది. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. పద్దతి ప్రకారం ఆందోళనలు తెలియజేయాలి.
  3. జగన్ & వైయస్సార్‌సిపి నాయకులు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా రెచ్చగొట్టుడు మానుకొవాలి.

bottomline:
ప్రజలు – నిస్సాహాయులు. ప్రజలను సన్మార్గంలో నడిపించవలసిన నాయకులు, ఆదిపత్యం కోసం ప్రజల మధ్య చిచ్చులు పెడుతూ, జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. పార్టీలు వేరైనా నాయకులందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళై వుండటంతో, నిస్సాహాయ ప్రజలు చూడటం మినహా ఏమి చేయలేని నిస్సాహాయ స్థితి. రాజకీయం పేరుతో క్షమించరాని నేరలకు కారకులవుతున్న నాయకులను ప్రశ్నించే వాడు కావాలి. పవన్‌కల్యాణ్ ఆ భర్తీని ఫిల్ చేస్తాడని ఆశీద్దాం.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *