ఫుల్ ఫ్రీడమ్

chiru(50)

హిరోకు కథ నచ్చాక ఒక సినిమాకు ప్రధానంగా మూడు దశలు వుంటాయి.

1) ప్రి ప్రొడక్షన్
2) ప్రొడక్షన్
3) పోస్ట్ ప్రొడక్షన్

ఏ దర్శకుడైనా అన్ని దశలలోనూ హిరో తనను గుడ్డిగా నమ్మాలని కోరుకుంటాడు.

చిరంజీవి సినిమా విషయంలో అది కుదరదు. చిరంజీవి ప్రమేయం కచ్చితంగా వుండాల్సిందే అని ఇండస్ట్రీ టాక్. ఫైనల్ స్టేజెస్‌లో చిన్న చిన్న మార్పులు అయితే ఒకే కాని, “అందరివాడు” సినిమా విషయంలో అడుగడుగునా కలుగుజేసుకొని శ్రీను వైట్లకు అసలు క్రియేటివ్ ఫ్రీడమ్ లేకుండా చేసేసారని, శ్రీను వైట్ల ఒక రకమైన విరక్తితో ఆ సినిమా కంప్లీట్ చేసాడని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. “ఢీ” సినిమా తర్వాత శ్రీను వైట్ల రేంజ్ పెరిగింది. దూకుడుతో పీక్స్‌కు చేరుకుంది. ఆగడుతో మాములు స్థాయికి వచ్చింది.

ఇప్పుడు కూడా వేలు పెట్టి అనిరుధ్ రామ్‌చరణ్ ఎంచుకున్నా, అతను క్వాలిటీ టైం ఈ సినిమాకు పనిచేసే అవకాశం లేకపొవడంతో శ్రీనువైట్ల ఫెవరెట్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ టింలోకి వచ్చాడు.

ఈ తమిళ్ మ్యూజిక్ దర్శకులతో అదే ప్రొబల్మం. మన తెలుగుసినిమాల మధ్య పోటిని అర్దం చేసుకొని అనుకున్న టైంకు ఫినిష్ చెయ్యకపొతే వచ్చే నష్టాలు వాళ్ళకు తెలియదు. “గోవిందుడు అందరివాడేలే” సినిమాకు కూడా “యువన్ శంకర్ రాజా” ఇటువంటి ఇబ్బందులే పెట్టాడు కాని, కృష్ణవంశీ ఎదో రకంగా మెనేజ్ చేసాడు.

తమన్ ఎంట్రోతో శ్రీనువైట్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్టే. తనకిచ్చిన ఫ్రీడమ్‌తో రామ్‌చరణ్ నుంచి ఎక్సపెట్ చేసే స్టెప్స్‌కు స్కోప్ వున్న “నాయక్” “లైలా .. ఓ లైలా” సాంగ్‌ను మించిన సాంగ్ తమన్ నుంచి రాబడతాడో లేదో చూడాలి.

image

Filed Under: Mega FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *