‘బసంతి’ ఆడియో

పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా బసంతి ఆడియో

పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా బసంతి ఆడియో

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ‘బాణం’ఫేం దంతులూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘బసంతి’. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించి టి.సుబ్బిరామిరెడ్డి, గౌతమ్‌లకు అందించారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” నేను బాణం సినిమా డివిడి చూశాను. చైతన్య గారి రెండో సినిమా గౌతం రెండో సినిమా అయిన ఈ బసంతి తప్పకుండా హిట్టవ్వాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

ఏ విధమైన టెన్షన్ కాని, ఇబ్బంది కాని లేకుండా చాలా కూల్‌గా ఈ ఫంక్షన్‌లో పవన్‌కల్యాణ్ పాల్గొనడం విశేషం.

Filed Under: Extended FamilyFeatured