రాంగోపాలవర్మను బాగా అర్దం చేసుకున్నాడు

RGV

“సర్దార్ గబ్బర్ సింగ్” ఆడియో రిలీజ్ ఫంక్షన్కు కేవలం పాస్లు ఉన్నవారు మాత్రమే రావాలని చెప్పడానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తనపై రాంగోపాలవర్మ చేసే ట్వీట్స్‌కు పవన్‌కల్యాణ్ స్పందన తెలియజేసాడు.

రాంగోపాలవర్మ చాలా తెలివైన వాడు. ఎవరికీ అందకపొవడం ఆ తెలివితేటల ప్రత్యేకత. ఆయన అభిప్రాయాలు అందరికీ చేరేలా ట్వీటర్ ఎకౌంట్‌ను రాంగోపాలవర్మ వాడుకున్నట్టుగా ఎవరూ వాడుకోరు అంటే అతిశయోక్తి కాదు. అందుకు ఆయన తెలివితేటలే కారణం. తెలివితేటలు ఉపయోగించి, అబద్దాలను నిజాలను మిక్స్ చేసి, ఎవరినైనా పొగడ్తలతో ముంచేస్తూ వుంటాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు కథనాలు సృష్టించుకుంటారు. మీడియాకు మంచి న్యూస్ ఫీడర్.

పవన్‌కల్యాణ్ రాంగోపాలవర్మను బాగా అర్దం చేసుకున్నాడు. పనిచేసేవాడు కుక్కల అరుపులు పట్టించుకోడు అనే వుద్దేశంతో, ఆయన అభిప్రాయలను గౌరవిస్తానంటూ పవన్‌కల్యాణ్ రాంగోపాలవర్మ కంటే తెలివిగా సమాధానం చెప్పాడు.

పాపం రాంగోపాలవర్మ తనదైన శైలిలో ఇలా ట్వీట్ చేయకతప్పలేదు.

Ram Gopal Varma ‏@RGVzoomin:
I respect P K more than his fans respect him and even more than P K respects himself..My advise to him is only as a respectful fan

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *