బాబుపై పవన్‌కల్యాణ్ గుడ్డి నమ్మకం

Pawan-Kalyan2

పవన్‌కల్యాణ్ కులం, పవన్‌కల్యాణ్ ఆవేశం బాబుకు బాగా నచ్చేసాయి. వాటితో పాటు పవన్‌కల్యాణ్ వీక్‌నెస్ కూడా బాగా గ్రహించేసాడు. అందులో భాగంగా పవన్‌కల్యాణ్ గౌరవానికి ఎక్కడా లోటు రానివ్వటం లేదు. ఇవే కారణాలో, మరేమన్నా వున్నాయెమో తెలియదు కాని, బాబుపై పవన్‌కల్యాణ్ గుడ్డి నమ్మకం పెట్టేసుకున్నాడు.. బాబు చేతుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షేమం అనుకుంటున్నాడు.

మన ఆస్తులు మనమే తగలబెట్టుకొవడం, ఎవరూ హర్షించరు. ఇదే అదనుగా సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపొయాయి. శాంతియుతంగా కంట్రోల్ చేయవలసిన అధికారం ప్రభుత్వాన్ని, మొన్న పవన్‌కల్యాణ్ ప్రెస్ మీట్‌లో ఒక ప్రశ్నతో సరిపెట్టాడు. అడగవలసిన ప్రశ్నలు అడగలేకపొయాడు.

  1. కాపులను బి.సిల్లో చేర్చుతాం అని ఎవడు హామీ ఇవ్వమన్నాడు?
  2. వెనుకబడిన కాపులకు సంవత్సరానికి 1000 కోట్లు ఆర్దిక సహాయం చేస్తామని ఎవరు వాగ్దానం ఇమ్మన్నారు?
  3. కులంకు సంబంధించిన మీటింగ్‌కు తెలుగుదేశం నాయకులని ఎందుకు కట్టడి చేయవలసి వచ్చింది? (ప్రశాంతంగా పదివేల మంది మీటింగ్‌తో అయిపొవాల్సిన సభ చంద్రబాబు కట్టడి వలన పది లక్షలను మించేలా కారణమయ్యింది.)
  4. ప్రజలకు భద్రత ఇవ్వాల్సింది పోయి, సభకు అధికార ప్రభుత్వం ఆటంకాలు సృష్టించవలసిన పనేమిటి?
  5. హామీలను ప్రశ్నిస్తున్న కుల నాయకులను, చర్చలతో శాంతింప జేయకుండా, రెచ్చగొట్టేలా అధికార ప్రభుత్వం వ్యవహరించడం ఏమిటి?

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *