బాలయ్య భార్యగా నదియా

attarintiki-daredi-thank-you-meet-stills-72

ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నదియా మిర్చిలో ప్రభాస్ కు అమ్మగా, అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కు అత్తగా సక్సెస్ ఫుల్ క్యారెక్టర్స్ చేసింది.

అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ తర్వాత, టాలీవుడ్ దర్శక నిర్మాతల చూపంతా నదియా మీదే ఉంది. భారీ ఆఫర్స్ నదియాను వరించనున్నాయి. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లెజండ్ చిత్రం కోసం నదియాను సంప్రదించారని సమాచారం. ఇందులో సీనియర్ బాలయ్యకు భార్యగా నదియా కనిపించే అవకాశముందట. ప్రస్తుతం నదియాతో కథా చర్చలు జరుగుతున్నాయట.

దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలయ్య సినిమాకు సంగీతమందిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ తర్వాత, ప్రణీతకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

Filed Under: Extended FamilyFeatured