బాహుబలికి ముందే S/O సత్యమూర్తి

image

త్రివిక్రమ్ దర్శకత్వం లో అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం S/O సత్యమూర్తి. ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఎక్సపెటేషన్స్ వున్నాయి. సమంతా, నిత్యామీనన్, అదా శర్మలు అల్లు అర్జున్ సరసన హీరోయిన్ లు నటించగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మార్చి 8 న ఈ సినిమా కు సంబంధించిన ఆడియో ను విడుదల చేయనున్నారు. అంతేకాకుండా ఈ వేసవి లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఒక కమర్షియల్ సినిమాకు రిలీజ్ డేట్ చాలా ముఖ్యం.

బాహుబలి రెండు సంవత్సరాలు పైనే కష్టపడి అత్యంత భారీగా నిర్మించడంతో భారీ హైప్ నెలకొని వుంది. అటు మాస్ ఇటు క్లాస్ అనే తేడా లేకుండా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు పోటి వెళితే నిలబడటం కూడా కష్టమే. వేరే పెద్ద సినిమాలు ఒక నెల ముందుగానో ఒక నెల తర్వాతో ప్లాన్ చేసుకోవడం మంచిది. తాజాగా బాహుబలి దర్శకుడు రాజమౌళి మే 15న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేసాడు. S/O సత్యమూర్తి కి లైన్ క్లియర్ అయినట్టే. ఏప్రిల్ 3న లేదా ఏప్రిల్ 10న రిలీజ్ ఎక్సపెట్ చేయవచ్చు.

Filed Under: Mega FamilyFeaturedTelugu