బాహుబలిని కొట్టడం కష్టం

a aa

రాజమౌళి “మగధీర” కలక్షన్స్ క్రాస్ చెయ్యడానికి 6 సంవత్సరాలు పట్టింది. రాజమౌళి కూడా క్రాస్ చేయలేకపొయాడు. అత్తారింటికి దారేది సినిమాతో త్రివిక్రమ్ క్రాస్ చేసాడు.అత్తారింటికి దారేది వరల్డ్ వైడ్ షేర్ 80 కోట్లు.

బాహుబలితో రాజమౌళి అత్తారింటికి దారేది సినిమా కలక్షన్స్ క్రాస్ చేసాడంటే అసహ్యంగా వుంటుంది. ఎందుకంటే బాహుబలితో రాజమౌళి కమర్షియల్‌గా ఎవరికీ అందనంత ఎత్తులోకి చేరుకున్నాడు. ఆ సినిమాను ఈ సినిమాను క్రాస్ చేసాడనే కంటే, ఎవరూ రీచ్ కాలేని సరికొత్త రికార్డ్ సెట్ చేసాడంటే కరెక్ట్. బాహుబలి వరల్డ్ వైడ్ తెలుగు షేర్ 160 కోట్లు. అత్తారింటికి దారేది సినిమాకు డబుల్.

బాహుబలి తర్వాత శ్రీమంతుడు అత్తారింటికి దారేదిని క్రాస్ చేసి సెకండ్ ప్లేస్‌లో వుంది. వరల్డ్ వైడ్ షేర్ 90 కోట్లు. బాహుబలిని పక్కన పెట్టి, అందరూ శ్రీమంతుడిని టార్గెట్ చేసుకుంటున్నారు. బాహుబలిని కొట్టడం కష్టం అని ఫిక్స్ అయిపొయారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్: ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు కాని, రాజమౌళి బాహుబలి రికార్డ్స్‌ను కొట్టగల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే అని కొందరి అంచనా. త్రివిక్రమ్ శ్రీనివాస్ పెద్ద హిరోతో బాహుబలిని టార్గెట్ చేస్తూ, భారీగా ఒక సినిమా చేయగల్గితే సరిపోదు. ఆ భారీతనానికి తగ్గ కథతో పాటు సినిమాను, సినిమా మొదలైన దగ్గరనుండి అందరూ ఓన్ చేసుకొనేలా హైప్ చేయగల్గాలి.

త్రివిక్రమ్ “అ ఆ”: ఎవరేజ్ వెబ్ రివ్యూలు, పాజిటివ్ మౌత్ టాక్ తో మొదలయిన త్రివిక్రమ్ “అ ఆ” ఏ రేంజ్ సినిమా అవుతుంది, కమర్షియల్‌గా ఎంత(50 కోట్లు షేర్, 60 కోట్లు షేర్, 70 కోట్లు షేర్) చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Filed Under: అ ఆ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *