బాహుబలి పబ్లిసిటి మొదలైంది

image

పబ్లిసిటి అంటే ప్రేక్షకులని ప్రిపేర్ చెయ్యడం. ఎలా ప్రిపేర్ చెయ్యాలో రాజమౌఌకి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో.

మగధీర , మర్యాద రామన్న & ఈగ సినిమాలకు పూర్తి కథ చెప్పేసాడు.

బాహుబలి కి మాత్రం ఇంకా చెప్పలేదు. ఈసారి చెప్పే ఉద్దేశం కూడా కనిపించడం లేదు.

చాలా హైప్ వుంది. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రి కూడా ఎదురుచూస్తుంది.

తెలుగులో 100కోట్లు షేర్ సాధించే మొట్టమొదటి సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్న ఈ సినిమాలో రిపీట్ ఆడియన్స్ కోసం ఏం అంశాలు జోడించాడో ఆసక్తికరమైన విషయం.

వేరే సినిమాల రిలీజ్ ఈ సినిమా రిలీజ్ పై ఆధారపడి వుండటంతో, ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ వీడియోలో పార్ట్-1 ఒక పాట మినహా మిగతా భాగం షూటింగ్ అయిపోయిందంటూ మే 15 న బాహుబలి రిలీజ్ అంటున్నాడు.

బాహుబలి పబ్లిసిటి మొదలైంది అనుకోవచ్చు

Filed Under: Extended FamilyFeaturedTelugu