బాహుబలి మే 15 కష్టమే

jil

తెలుగువాళ్ళ గర్వించే స్థాయిలో నిర్మింపబడుతున్న చిత్రం బాహుబలి. మే 15న రిలీజ్ చెయ్యడానికి కష్టపడుతున్నాం అని రాజమౌళి ఎనౌన్స్ చేసాడు కాని, మే 15న రావడం కష్టం అనే టాక్ వినిపిస్తుంది.

తెలుగు సినిమాల సంఖ్య పెరిగింది. డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు కాబట్టి, వాటి నుంచి కూడా పొటీ వుంది. సినిమాకు రిలీజ్ డేట్ దొరకటం కష్టం అయిపోతుంది.

త్రివిక్రమ్-బన్ని S/Oసత్యమూర్తి ఏప్రిల్ 2న వస్తున్నాడు.

లౌక్యం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నగోపిచంద్ హీరోగా వస్తున్న జిల్ రిలీజ్ ఎప్పుడో?. పరిస్థితులు చూస్తుంటే ఒక వారం S/Oసత్యమూర్తి సినిమాకు అటూ ఇటూగా వుండేట్టు వుంది. ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తో తొలి ప్రయత్నమే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

గోపిచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే స్టామినా ఉన్న సినిమాగా వున్న ఈ సినిమాను S/Oసత్యమూర్తి తో పోటిపడి రిలీజ్ చేసే బదులు ,బాహుబలి మే 15న రాకపొతే,ఒక నెల ఆగి, మే నెలలో రిలీజ్ చెయ్యడం బెటర్.

Filed Under: Extended FamilyబాహుబలిTelugu