బాహుబలి ప్రభాస్ లుక్‌

baahubalifirstlok

ప్రభాస్ బర్త్డే సంధర్భంగా, ప్రభాస్ లుక్‌తో పాటు బాహుబలి చిత్రం మేకింగ్ వీడియోను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు.

మగధీర సినిమా రికార్డ్స్‌ను బ్రేక్ చెయ్యడం మళ్ళీ రాజమౌళి ‘బాహుబలి’ వలనే సాధ్యం అనుకున్నారు. కానీ, ఆ రికార్డ్‌ను పవన్‌కల్యాణ్ సహాయంతో త్రివిక్రమ్ సాధించేసాడు. అత్తారింటికి దారేది సినిమా ఫైనల్ షేర్ వంద కోట్లు కష్టం, 80 కోట్లు దగ్గర ఆగిపోవచ్చు అని ట్రేడ్ వర్గాలు ఊహిస్తున్నారు.

తెలుగులో వంద కోట్లు షేర్ సాధించే మొదట తెలుగు సినిమాగా బాహుబలి అవుతుందెమో చూడాలి.

రామ్‌చరణ్’ఎవడు’
మహేష్‌బాబు’1′
అల్లు అర్జున్’రేసు గుర్రం’

సినిమాలు ఎంత షేర్ సాధిస్తాయో కూడా చూడాలి.

మహేష్‌బాబు’1,’ సుకుమార్ సామాన్య తెలుగు ప్రేక్షకులకు కన్‌ఫ్యూజన్ లేకుండా సింపుల్‌గా అర్దం అయ్యేలా తీస్తే ఈ సినిమానే వంద కోట్లు సాధించే అవకాశం వుంది.

రాజమౌళి తనకు పోటి అని భయపడే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ & సుకుమార్. (ఇక్కడ భయం అంటే తన దృష్టిలో బాగా వర్త్ వున్న డైరక్టర్స్ అని, నిజంగా భయం అని కాదు గమనించగలరు.) ఒకరు మగధీర రికార్డ్స్‌ను బ్రేక్ చేసారు. మరొకరు సుకూమార్ వంద కోట్లు సాధించే మొదట తెలుగు సినిమా రికార్డ్ బ్రేక్ చేస్తే, రాజమౌళి ఏమి సాధిస్తాడో చూడాలి.

Filed Under: Extended FamilyFeatured