బాహుబలి – New Industry HIT

Industry HIT

కొడితే ఇలా కొట్టాలి. ఇండియాలో ఎంత మార్జిన్‌తో క్రాస్ చేస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలి. ఇండియాలో ఒక ఎత్తు, అమెరికాలో ఒక ఎత్తు. ఇది వరకు పల్లెటూర్ల నుంచి బండ్లు ఏసుకొని టౌన్‌కు వచ్చి ఎన్.టి.ఆర్ & ఎ.యన్.ఆర్ సినిమాలూ చూసే వాళ్ళు అని పెద్దలు చెపితే వినేవాళ్ళం. ఇప్పుడు అమెరికాలో తెలుగు వాళ్ళు సినిమా థియేటర్స్‌కు కదిలి వస్తుంటే, ఆ మాటలు గుర్తు వస్తున్నాయి అంటున్నారు. తెలుగు అనే ప్రతి ఒక్కళ్ళు తమ తమ ఫ్యామిలీస్‌తో ఈ సినిమా చూసారంట. ఇంతకు ముందు హిట్ సినిమా కలక్షన్స్ 1.8 మిలియన్ అయితే, ఇప్పుడు ఏకంగా 4.5 మిలియన్స్ పైనే అంటున్నారు.

తన పాయింట్‌లో రిస్క్‌కు తగ్గ ఫలితమా అంటే చెప్పలేము కాని, ప్రేక్షకుల పాయింట్‌లో హాట్సాఫ్ టు రాజమౌళి !!!

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *