బురదజాతి ఆలోచన్ల ‘భాయ్’

Bhai movie Latest Working Stills (2)

ఎవడికి వాడు గొప్ప కాబట్టి, మనం గొప్ప అని చెప్పుకొవడం అందరూ చేసేది. ఎవరినీ కించపరిచినట్టు కాదు. ఆ వుద్దేశంతో “నేను ట్రెండ్ ఫాలో అవ్వను .. ట్రెండ్ సెట్ చేస్తా” అని హరీష్ శంకర్ వ్రాయడం, దానిని పవన్ కల్యాణ్ చెప్పడం, అవి పెద్ద హిట్ అవ్వడం జరిగిపోయింది. ఇటువంటి డైలాగ్స్ కొకొల్లలుగా వున్నాయి భాయ్ సినిమాలో. వాటిపై ఎవరికీ అభ్యంతరం వుండదు. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కూడా.

గబ్బర్‌సింగ్ డైలాగ్ కు కౌంటర్‌గా, బురదజాతి ఆలోచన్లతో ‘భాయ్’ సినిమాలో ఒక డైలాగ్ పెట్టాడు ఆ సినిమా దర్శకుడు వీరభద్రం చౌదిరి.

భాయ్ సినిమాలో నాగార్జునను ఉద్దేశించి ఒక అనుచరుడు “ఇక్కడ ఎవడికి వాడు ట్రెంట్ సెట్ చేసావని భ్రమలో వున్నాడు. అసలు ట్రెంట్ సెట్ చేసేందే నువ్వే కదా భాయ్” అంటాడు.

ఇది కచ్చితంగా గబ్బర్‌సింగ్ సినిమాలోని డైలాగ్‌ను ఉద్దేశించి వ్రాసిందే అని చిన్న పిల్లాడిని అడిగినా చెపుతాడు. ఒక హిరోను కెలికి, ఆ కెలికిన దాని గురించి అందరూ మాట్లాడుకొవాలని దరిద్రపుగొట్టు ఆలోచన తప్ప, ఆ డైలాగ్ వలన ఏమైనా ఉపయోగం వుందా? .. ముష్టి గాళ్లకు కు ముష్టి ఆలోచన్లు తప్ప, మంచి ఆలోచన్లు వస్తాయా?

ప్రజలను మోసం చెయ్యడంలో ఒకరినొకరు పోటిపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, బాద్యతతో వ్యవహరించవలసిన నాయకులు ఏ దశకు తీసుకొచ్చారో చూసాం. ఇప్పుడు అటువంటి బురదను సినిమాల్లోకి తీసుకొస్తున్న వీరభద్రం లాంటి బురదజాతి దర్శకులను ఖండించ వలసిన బాద్యత ప్రతి సినిమా లవర్‌పై వుంది.

Filed Under: Extended Family