బ్రూస్‌లీ – Its official

Bruce Lee

యాక్షన్‌కు కామెడీని జతచేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత డివివి దానయ్య. తమ న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బ్రూస్ లీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారు. మ్‌చర ణ్ ఈ సినిమాలో బ్రూస్ లీకి ఫ్యాన్‌గా కనిపించడమే కాకుండా తన కుడిచేయి పై బ్రూస్‌లీ టాటూతో కనిపి స్తాడు. కాబట్టి సినిమాకు ఇది పర్‌ఫెక్ట్ టైటిల్ అని భావిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే వేడు కల కోసం ఈ సినిమా షూటింగ్‌కు గ్యా ప్‌నిచ్చిన చరణ్ తిరిగి సోమవారం నుం చి షూటింగ్ మొదలుపెట్టాడు. సినిమా కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైంది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ చిత్ర టీం మరో షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనుంది. చిరు బర్త్‌డే కానుకగా వచ్చిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా లో రామ్‌చరణ్ స్టంట్ మాస్టర్‌గా నటిస్తు న్నాడు. హీరోలకు డూప్‌గా కనిపించే పాత్రలో ఆకట్టుకోనున్నాడు.

Filed Under: Featuredబ్రూస్‌లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *