మనం సమాజాన్ని వుద్దరించేద్దాం ..

Common_Man_Protection_Force

మనం సమాజాన్ని వుద్దరించేద్దాం అనుకున్నంత బుద్ది మాలిన పని మరొకటి లేదు. అదీ రాజకీయం ద్వారా సాధిద్దాం అనుకుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో IMPOSSIBLE. కేవలం దేవుడు మాత్రమే చక్కదిద్ద గలడు. మనిషి చేతుల్లోంచి ఎప్పుడో చేజారిపోయిందనేది వాస్తవం.

తప్పుడు పనిని తప్పుడు పనులతో ఎదుర్కోవాలి, హిరో తప్పుడు పనులు చెయ్యడం తప్పు కాదు అని చాలా సినిమాలో చూసాం. ఇప్పుడు ప్రస్తుత్త సమాజంలో కూడా కళ్ళారా చూస్తున్నాం. సినిమాల్లో హిరో నిస్వార్దపరుడు, కాని మన సమాజంలో వున్న వాళ్ళు స్వార్దపరులు. మతం కులం ప్రాంతం పేరుతో చేసే తప్పుడు పనులన్నీ కరెక్టే అని ప్రజల మైండ్‌ను ట్యూన్ చేసేసారు. ఎవరూ మార్చలేరు.

తమ అభిమాన హిరో సినిమా రాగానే పైరసీపై ఎక్కడ లేని నీతులు చెప్పే ఆ అభిమానులే, వేరే హిరో పైరసీని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు చెప్పే రీజన్ మా హిరో సినిమా వాళ్ళు చేసారు, వాళ్ళ హిరో సినిమా మేము చేయవలసిందే అంటారు. అలా చెయ్యడం అసలు తప్పే కాదంటాం. ఇలా వుంటాయి మన నిజాయితీలు.

సాదారణ మనిషి పరిధి చాలా చిన్నది. అలా అని ఒక గొప్ప మనిషి పరిధి పెద్దది అని కాదు, సాదారణ మనిషి పరిధి కంటే కొంచం ఎక్కువ. అంతే.

పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే:
ఆవేశంలో కామన్‌మేన్ ప్రొటక్క్షన్ ఫోర్స్ అని స్టార్ట్ చేసాడు. ఎవరి కోసమో పవన్‌కల్యాణ్‌కే తెలియాలి. నిజం తెలిసాకా దాని గురించి ఎక్కడా పవన్‌కల్యాణ్ నోటి వెంట ఆ వూసు కూడా లేదు.

పవన్‌కల్యాణ్ వీలైనప్పుడల్లా “మీకోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీ” అని అంటూ వుంటాడు. ఆ డైలాగ్‌కు అర్దం ఏమిటో పవన్‌కల్యాణ్‌కే తెలియాలి. పవన్ చూట్టూ వున్న నలుగురి మాటలు తప్ప, నిజంగా అభిమానులు ఆయన దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నారో పవన్‌కల్యాణ్‌కు తెలుసా?

ఎన్నో ఆర్పిస్తారు. బ్యానర్లు కడతారు, పాలాభిషేకాలు చేస్తారు. ఎంతో టైమ్ వేస్ట్ చేసుకుంటారు. సమాజం వాళ్ళను పిచ్చోళ్ళగా చూడబడటానికి కూడా భయపడరు. దానికి ప్రతిఫలంగా ఏమీ ఆశీంచకపొవడమే అభిమానం. అభిమానులు కోరుకునేవి చాలా చాలా చిన్నవి.

bottomline:
ఎంతో మంది అభిమానులు పవన్‌కల్యాణ్ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీగా వున్నారు. మాటలు కాదు, అది నిజం. కాని వారు, ఇప్పుడు పవన్‌కల్యాణ్ వచ్చి సమాజాన్నీ వుద్దరించాలని ఎవరూ కోరుకొవడం లేదు. తన దగ్గరకు వచ్చే అభిమానులకు ఆప్యాయంగా చిన్న పలకరింపుతో ఒక ఫోటో దిగనిస్తే చాలు. వీటితో పాటు పవన్‌కల్యాణ్ తన ఫ్యామిలీతో తను హ్యాపీగా వుండాలి.

Filed Under: Pawan KalyanFeatured