మరోసారి ‘ఎవడు’ రిలీజ్ ఖరారు

Screen Shot 2013-12-31 at 8.29.19 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో తెరకెక్కించిన చిత్రం ‘ఎవడు’. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే చార్టుబస్టర్‌లో నెం.1 ఆడియోగా ఉండటం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. గత సంక్రాంతికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సూపర్ డూపర్ హిట్ కావడం, 7వ చిత్రం బ్లాక్ బస్టర్ కావటం సెంటిమెంట్ పరంగా ‘ఎవడు’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా విడుదల సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ చిత్రాన్ని సంబంధించిన స్పెషల్ టీజర్ ని జనవరి 3న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘ఎవడు’ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నాం. దీనికి సంబంధించిన స్పెషల్ టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది’ అన్నారు.

Filed Under: Mega FamilyFeatured