మరో మెగాస్టార్ బెస్ట్ స్టేజ్ పెరఫార్నన్స్

Screen Shot 2014-12-01 at 8.22.10 PM

మెగాస్టార్ చిరంజీవి ఛార్మ్ వేరు. డాన్స్ చేస్తున్నప్పుడు ఎవరూ కళ్ళు తిప్పుకొలేరు, ఆనందంతో పరవశించి పొతూ వుంటారు మెగా అభిమానులు. చిరుతనయుడిగా రామ్‌చరణ్ ఆ స్థాయి ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప, వారసుడిగా వాటంతటవి వచ్చేయలేదు. సాయి ధర్మ్ తేజ్‌కు మాత్రం మేనమామ పోలికలు వలనెమో, మెగాస్టార్ ఛార్మ్ కూడా వచ్చేసినట్టు వుంది. ‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ దర్శకుడు కె.యస్.రవికుమార్ ఆశించినట్టు మెగా అభిమానులు ‘మరో మెగాస్టార్‘ అని పిలిచుకునే రోజు అతి దగ్గర్లోనే వుంది. మేము సైతం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకొవడానికి ‘మరో మెగాస్టార్‘ సాయి ధర్మ్ తేజ్ బెస్ట్ స్టేజ్ పెరఫార్నన్స్ ఇచ్చాడు. చిరంజీవి డాన్స్ ఎంత ఎంజాయ్ చేసారో బన్నీ డాన్స్ & సాయి ధర్మ్ తేజ్ డాన్స్ కూడా అంతే ఎంజాయ్ చేసారు.

Filed Under: Mega Family