మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బన్నీ

bunny

అల్లు అర్జున్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి పచ్చజెండా ఊపేశారట. డాన్‌శీను, బలుపు చిత్రాలతో మాస్‌ని అలరించిన దర్శకుడు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారని ఫిలిమ్‌నగర్ సమాచారమ్. గోపీచంద్ చెప్పిన కథ బన్నీకి విపరీతంగా నచ్చేయడంతో ఈ సినిమాలో నటించడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

ప్రస్తుతం బన్నీ.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘రేసుగుర్రం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ సినిమాతో పాటు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా సెట్స్‌కి వెళుతుందని తెలుస్తోంది.

బన్నీతో ‘పరుగు’ లాంటి విజయవంతమైన చిత్రం తీసిన ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని వినికిడి. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

హరీష్‌శంకర్ బన్నీ కోసం ఒక కథ తయారు చేసాను, వినిపిస్తున్నాను అని ఎప్పుడో ట్వీట్ చేసాడు. అది ఏమయ్యిందో?

Filed Under: Mega FamilyFeatured