మహేష్‌బాబు చేతుల మీదగా “అఖిల్” ఆడియో

akhil and mahesh

ఇది వరకు హైప్ అంటే చాలా భయపడి పొయేవాళ్ళు. సినిమాకు భారీ ఓపినింగ్స్ రావాలంటే హైప్ చాలా అవసరమని ఇప్పుడు అందరూ రియలైజ్ అయ్యారు. హైప్ చెయ్యడానికి కొత్త కొత్త మార్గాలతో ముందుకు వస్తున్నారు.Good For Industry.

ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అఖిల్ మూవీలో మ‌రో రెండు పాట‌లు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అఖిల్‌ దసరా కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 20న (ఆదివారం) ఏఎన్నార్ జ‌యంతి సంద‌ర్భంగా అఖిల్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున జరగనున్న ఈ ఆడియో ఆవిష్కరణ టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు, స్టార్ హీరోలు హాజ‌ర‌వుతున్నారు. ప్రిన్స్ మ‌హేష్‌బాబు కూడా ముఖ్యఅతిథిగా హాజ‌ర‌వుతున్నాడు.

ఇప్ప‌టికే భారీ క్రేజ్‌తో ఉన్న అఖిల్ సినిమా భారీ బిజినెస్ జరిగింది. ఆడియో ఆవిష్కరణకు మహేష్ రానుండడంతో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌పై ఆసక్తి కూడా భారీగా పెరిగింది. టాలీవుడ్‌లో ఓ డెబ్యూ మూవీ హీరో ఆడియో ఫంక్ష‌న్ జ‌ర‌గ‌ని విధంగా అఖిల్ మూవీ ఆడియో వేడుక‌ను చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. నిర్మాత నితిన్ ఈ ఏర్పాట్ల‌ను దగ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి సైరాభాను మ‌న‌వ‌రాలు స‌యేషా సైగ‌ల్ న‌టిస్తోంది.

Filed Under: అఖిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *