మహేష్‌బాబు నమ్మకం ఏమవుద్దో

Share the joy
  •  
  •  
  •  
  •  

MB

మహేష్‌బాబు & శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.

‘బ్రహ్మోత్సవం’ పై అంచనాలు పెద్దగా లేవు. కారణం అడ్డాల శ్రీకాంత్. శ్రీకాంత్ అడ్డాల “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాను కొందరకు కనెక్ట్ చేయగల్గాడు.కనెక్ట్ అయిన వాళ్ళకు బాగా నచ్చింది. కనెక్ట్ కానివాళ్లకు టి.వి సిరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత అతను చేసిన ముకుంద సినిమాలో కొన్ని మాస్ ఎలిమెంట్స్ కలుపుతూ చేసిన ప్రయత్నం ఘోరంగా ఫెయిల్ అయ్యి, ఎవరికీ నచ్చకుండా పోయింది.

ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి కారణం మహేష్‌బాబు శ్రీకాంత్ అడ్డాలపై పెట్టుకున్న నమ్మకం. మహేష్‌బాబు నమ్మకం ఏమవుద్దో తెలియదు కాని, టీజర్ ప్రేక్షకులు వూహిస్తున్నట్టుగానే డల్‌గా వుంది. ఈనెల 7న హైద్రాబాద్‌లో వైభవంగా ఆడియో రిలీజ్ జరగనుండగా, 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మధురం మధురం’ అంటూ వచ్చే మధురాష్టకం పద్యంలోని లైన్స్‌కి మిక్కీ జే మేయర్ అందించిన ట్యూన్ వినసొంపుగా వున్నా, విజువల్స్‌లో పెద్ద కిక్ లేదు.

Filed Under: బ్రహ్మోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *