మార్చి 27న గోపిచంద్ జిల్

Screen Shot 2015-03-17 at 6.47.35 AM

రామ్‌చరణ్ “గోవిందుడు అందరివాడేలే” సినిమాకు ఒక వారం రోజులు ముందు తన లౌక్యం సినిమా రిలీజ్ చేసి, మంచి టాక్ తెచ్చుకొని కూడా థియేటర్స్ లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ S/O సత్యమూర్తి సినిమా ఒక వారం రోజులు రిలీజ్‌కు ముందు వస్తున్నాడు. అదే రోజు మరో మెగా మూవీ “రేయ్” రిలీజ్ వుండటం విశేషం.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తో తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై గోపిచంద్ హీరోగా నిర్మించిన చిత్రం జిల్. రాశిఖన్నా హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జిల్ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇటీవలే ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరై విడుదల చేసిన ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Filed Under: Extended FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *