మార్చి 27న “రేయ్”

image

మెగాస్టార్ ఫ్యామిలి నుంచి అనుకోకుండా స్టార్ హిరోగా దూసుకుపోతున్న హిరో సాయి ధర్మ్ తేజ్. ‘పిల్లా నువ్వులేని జీవితం’ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు.

నిజానికి సాయి ధర్మ్ తేజ్ ‘రేయ్’ తో పరిచయం కావాల్సి వుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఈ వాయిదాల పర్వం వల్ల సాయి ధరమ్ తేజ్ నటించిన రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ మొదటి సినిమాగా ముందు రిలీజ్ అయిపోవడమే కాకుండా సూపర్ హిట్ అయ్యింది. ఇది రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోతుందని చాలా సార్లు వార్తలు వచ్చాయి.

అనుకున్న దాని ప్రకారమే ఈ సినిమా రిలీజ్ కోసం సరికొత్త రిలీజ్ డేట్ ని ఖరారు చేసారు.ఈ చిత్ర టీం అనౌన్స్ చేసిన సమాచారం ప్రకారం ఈ సినిమా వారం తోజుల క్రితమే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అంతే కాకుండా మార్చి 27న గ్రాండ్ గా ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ హీరోయిన్స్ గా నటించారు. వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ సినిమాని ఎక్కువ భాగం కరేబియన్ దీవులు, కాలిఫోర్నియాలో షూట్ చేసారు. స్వర్గీయ చక్రి సంగీతం అందించాడు.

Filed Under: Mega FamilyFeaturedTeluguరేయ్