క్లాస్ సినిమాతో రాబోతున్న మాస్ హిరో

varun tej

నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల ‘ముకుంద’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక.

“పెద్ద హిరోలు” .. “చిన్న హిరోలు” “మాస్ సినిమా “.. “క్లాస్ సినిమా” “క్లాస్ హిరో” .. “మాస్ హిరో” ఇలా చాలా మాటలు వినిపిస్తూ వుంటాయి. ఆ పదాలపై ఎవరికిష్టమైన నిర్వచనాలు వాళ్ళకి వున్నాయి, “అవేమి కాదు .. మంచి సినిమా లేదా చెడ్డ సినిమా మాత్రమే ” అనే వాళ్ళు కూడా వున్నారు.

వరుణ్ తేజ్ ఫోటోలు చూసి క్లాస్ హిరో అవుతాడేమో అనుకున్నారు కాని, “వరుణ్ తేజ్ క్లాస్ హిరోనా? మాస్ హిరోనా?” అని అంటే మాస్ హిరోనే అంటున్నారు ముకుంద టీజర్ చూసిన మెగా అభిమానులు. పూరి జగన్నాధ్ చెప్పిన మాస్ సబ్జక్ట్ కాదని, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి అరుదైన సినిమాను తెలుగుప్రేక్షకులకు అందించిన శ్రీకాంత్ అడ్డాల చెప్పిన క్లాస్ సినిమా ఎంచుకోవడం విశేషం.

Note:

  1.  మాస్ ఇమేజ్ సంపాదించడం చాలా చాలా కష్టం. ఈ ఇమేజ్‌ను ఎటువంటి పరిస్థితుల్లో ఇగ్నోర్ చెయ్యకూడదు
  2.  మాస్ ఇమేజ్‌తో పాటు క్లాస్ ఇమేజ్ వుంటేనే మాస్ క్లాస్ అనే భేదం లేకుండా చిరంజీవిలా అందరినీ అలరించవచ్చు
  3.  కేవలం మాస్ ఇమేజ్ మాత్రమే వున్నా or కేవలం క్లాస్ ఇమేజ్ మాత్రమే వున్నా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హిరోల్లో ఒకడిగా మనుగడ సాగించడం కష్టం
  4.  మాస్ ఇమేజ్ మెగా ఫ్యామిలీలోనే వున్నట్టు వుంది కాబట్టి, ఫస్ట్ సినిమాతోనే క్లాస్ కు కూడా దగ్గరవుదాం అన్న వరుణ్ తేజ్ నిర్ణయం కరెక్టే

Filed Under: Mega FamilyFeatured