మీడియా ఊహాగానాలే కరెక్ట్ అయ్యాయి

ram charan

ఎవడు సినిమా నిర్మాత దిల్ రాజు ఒక వంద సార్లు ఎవడు సినిమా రిలీజ్ డేట్ మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవద్దు, ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ 19 అని కన్‌ఫార్మ్ చేసాడు. కాని చివరికిఎవడు రిలీజ్ డేట్ విషయంలో మీడియా ఊహాగానాలే కరెక్ట్ అయ్యాయి.

రామ్‌చరణ్‌ అఫీషియల్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా చరణ్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘ఇక ఎదురు చూపులు అక్కర్లేదు. ‘ఎవడు’ సినిమాని జనవరి 12న విడుదల చేస్తూ సంక్రాంతి పండుగను కాస్త ముందుగానే తెస్తున్నాం. పెద్ద పండుగను ఇలా సెలెబ్రేట్‌ చేసుకుందాం’ అంటూ చరణ్‌ పోస్ట్‌ చేశాడు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సిన విషయం మనకు తెలిసిందే. రకరకాల కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. చివరికి సంక్రాంతికి వెలుగు చూస్తోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రుతిహాసన్‌, ఎమీ జాక్సన్‌ హీరోయిన్లుగా నటించారు

Filed Under: Mega FamilyFeatured