ముకుంద ఎప్పుడు రిలీజ్ చెయ్యాలి?

varun

మెగా ఫ్యామిలీ నుంచి మరో మెగా హిరో నాగేంద్రబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ముకుంద’. పూజాహెగ్డే హీరోయిన్. నిజానికి ఈ దసరాకు రిలీజ్ కావాల్సి వుంది. కాని రామ్‌చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ వుండటం వలన నిదానంగా పని చేస్తున్నారు.

గోవిందుడు అందరివాడేలే పెద్ద హిట్ అయితే సంక్రాంతి దాకా వెయిట్ చేయవచ్చు. గోవిందుడు అందరివాడేలే పెద్ద ఫ్లాప్ అయితే దీపావళీకి ఈ సినిమా రిలిజ్ చేసేయవచ్చు. కాని గోవిందుడు అందరివాడేలే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకోలేదు, అలానే డిజాస్టర్ టాక్ సంపాదించుకొలేదు. కుటుంబ కధా చిత్రానికి తోడు హలిడేస్ తోడయ్యి టాక్‌తో సంబంధం లేకుండా ఫస్ట్ వీక్ కలక్షన్స్ అద్భుతంగా వున్నాయి. మంచి పబ్లిసిటీ మరియు ఇంకో పాట(లీడింగ్ సీన్స్) యాడ్ చేస్తే రేంజ్ పెరిగే అవకాశం వుంది. దాని ప్రభావం ముకుంద మీద పడింది.

ఇంతకు ముందు ఎనౌన్స్ చేసినట్టు అక్టోబర్ నెలాఖురున రిలీజ్ చేస్తారా? సంక్రాంతి దాకా ఆగుతారా అనేది చూడాలి.

Filed Under: Mega FamilyFeatured