ముకుంద సంక్రాంతికే

varun tej

వరుణ్‌తేజ్ అంటే మెగా హిరోల్లో పొడుగైన హిరోగా మెగా అభిమానూల్లో ఒక ప్రత్యేకత ఏర్పర్చుకున్నాడు. మొదటి సినిమా మాస్ సినిమాతో కాకుండా క్లాస్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. కాకపొతే టీజర్లో క్లాస్ కంటే మంచి మాస్ లుక్ కనిపించింది. మంచి ప్లానింగ్ వుంటే, పెద్ద హిరో అవ్వడానికి అట్టే సమయం అవసరం లేదు.

మంచి ప్లానింగ్ అంటే
1) ఏదో ఒక వర్గం ప్రేక్షకులకే పరిమితం కాకుండా క్లాస్‌ను మాస్‌ను బ్యాలెన్స్ చేసే సినిమాలు చెయ్యాలి ..
2) ఈ రోజుల్లో రిలీజ్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ .. eg: పవర్ లౌక్యం సినిమాలు పెద్ద హిరోలతో పొటీ పడకుండా వేరే టైంలో రిలీజ్ అయ్యి వుంటే, ఇంకా బాగా ఆడేవి.

‘ముకుంద’ ఈ దసరాకు రిలీజ్ అయ్యి వుంటే చాలా బాగుండేది. రామ్‌చరణ్ గోవిందుడు అందరివాడేలే వుండటంతో స్లో అవ్వక తప్పలేదు. దీపావళికి చేస్తే బాగానే వుండచ్చు కాని, నవంబర్ & డిసెంబర్ నెలలు అంటే చలి ఎక్కువతో పాటు సినిమాలకు అన్ సీజన్ అంటూ వుంటారు. కాబట్టి సంక్రాంతి దాకా ఆగితే బెటరే. కాకపొతే సంక్రాంతికి పవన్‌కల్యాణ్-వెంకటేష్ & పూరి-ఎన్.టి.ఆర్ సినిమాలు కూడా వున్నాయి.

సంక్రాంతి అంటే రెండు మూడు సినిమాలకు అవకాశం వుంటుంది కాబట్టి, కరెక్ట్‌గా అవి రిలీజ్ అయ్యే డేటే కాకుండా ఒక వారం ముందు రిలీజ్ చేస్కుంటే మంచింది. ఎలాను ‘ముకుంద’ ఫ్యామిలీ మొత్తం హ్యాపిగా చూడదగిన సినిమా కాబట్టి కొద్దిగా ఏడ్వాంటేజ్ వుండచ్చు.

Filed Under: Mega FamilyFeatured