ముకుంద స్టామినా

Screen Shot 2014-12-19 at 6.15.34 PM

వరుణ్ తేజ్, పూజా హెడ్గే జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించిన సినిమా ‘ముకుంద’. నిన్ననే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ ప్రధానం చేసింది.

వరుణ్ తేజ్ తొలి సినిమాగా ‘ముకుంద’పై మెగా అభిమానులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మిక్కి జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా తెరకెక్కింది.

అంతా బాగానే వుంది కాని ఈ సినిమాపై అసలు హైప్ లేదు. హిట్ టాక్ వస్తే గాని, భారీ ఓపినింగ్స్ రావు. మొదటి సినిమాతోనే వరుణ్‌తేజ్ పెద్ద హిరోగా సెటిల్ అవ్వాలని మెగా అభిమానులందరూ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. సంక్రాంతి పండగ సీజన్ మిస్ అవుతుందని బాద వున్నా “1) శ్రీకాంత్ అడ్డాల మంచి సినిమా తీసుంటాడు” “2) వరుణ్‌తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది” “3) హిరోయిన పూజా హెగ్డే పెద్ద ప్లస్ అవుతాది” అనే నమ్మకాలు “ముకుంద” ఏ రేంజ్ సినిమాలుగా నిలబెడతాయో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే.

Filed Under: Mega Family