ముకుంద – exclusive review

Mukunda

ముకుంద ఎందుకు చూడాలి?

  1. వరుణ్‌తేజ్ మెగాఫ్యామిలీ నుంచి వస్తున్న అందమైన పొడుగు హిరో.
  2. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మంచోడు. మంచి సినిమాలే తీస్తాడు.
  3. పాటలు బాగున్నాయి.

ముకుంద ఎందుకు చూడకూడదు?

  1. రెగ్యులర్ ఎంటరటైన్‌మెంట్ లేదు.(వుంటే రోటిన్‌గా వుందని కామెంట్ చేస్తాం.)
  2. హిరో ఫ్రీగా లేడు. స్టిఫ్‌గా వున్నాడు. (మొదటి సినిమాలో ఇలా కాకుండా ఎలా వుంటారు?)
  3. వయలెన్స్ ఎక్కువైంది. (శ్రీకాంత్ అడ్డాల నుంచి ఎక్సపెట్ చెయ్యనిది. హిరో కటౌట్ చూసి పెట్టాడనుకుంట.)

ఇంతకి చూడచ్చా? లేదా?
చూడచ్చా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. కచ్చితంగా చూడండి అనే చెప్పే సినిమా కాదు. అలా అని స్కిప్ చెయ్యమని చెప్పే సినిమా కాదు.

హిరో వరుణ్‌తేజ్ ఒక మంచి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం కావాలనుకున్నాడు. అయ్యాడు.
దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ యూత్‌కు ఎదో మేసేజ్ ఇద్దాం అనుకున్నాడు. ఇచ్చాడు.

ప్రయత్నంలో లోపం లేదు. సబ్జక్ట్‌కు తగ్గట్టు దర్శకుడు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయినట్టు కనిపించలేదు.

సబ్జక్ట్(కథ) ఏమిటి?
మన భారతదేశంలో అత్యధిక యూత్ వున్నారు. మన యూత్ మనమేమి తక్కువ కాదు అని పని చేస్తే మన దేశం నెం 1 అవుతుంది.

కథనం ఎలా వుంది?
ఆలీ, ప్రవీణ్ & శేఖర్ కమ్ముల సహాయంతో చెప్పిన నారేషన్(కథనం) గ్రేట్ ఐడియా. డైరక్టర్ సాఫ్ట్‌నెస్ & హిరో ఎక్సప్రెషన్స్ వీక్ వలన, పవర్‌ఫుల్ అనిపించలేదు. It may click.

శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ ఎలా వుంది?
కథ-కథనం-మాటలు-దర్శకత్వం–> మాములుగా చాలా నిజాయితీగా ప్రయత్నం చేస్తాడు. ఈ సినిమా కూడా అంతే.

హిరోయిన్ ఎలా చేసింది? అంజలి అంత పేరొస్తుందా?
అంత స్కోప్ లేదు. మాములుగా సినిమాలు మేసేజ్ అంతర్లీనంగా వుంటూ, సినిమా అంతా ప్రేమ మీద నడుపుతారు. ఈ సినిమా పూర్తిగా ఆ ఫార్ములాకు భిన్నమైనది. ప్రేమ అంతర్లీనంగా వుంటుంది. చాలా సహజంగా వుండేట్టు చిత్రికరించడం ఈ సినిమా అనేక ప్రత్యేకతల్లో ప్రధాన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. క్యూట్ లవ్ స్టోరి.

రావు రమేష్ ఎలా చేసాడు?
అత్తారింటికి దారేది లో నదియా రోల్ డామినేట్ చేసింది. ఈ సినిమాలో ఆ ప్రొబల్మం లేదు. డైలాగ్స్ అర్దం కాకపొయినా, ఈయన చెప్పిన తీరుకి అర్దం అయినట్టే అనిపించి నవ్వుకుంటాం.

ప్రకాష్ రాజ్ ఎలా చేసాడు?
JP inspiration అనుకుంట.

మిగతా నటీ నటులు ఎలా చేసారు?
రఘుబాబు ప్రత్యేకత ఏమీ కనిపించదు. కొత్తవాళ్ళందరూ చాలా సహజంగా అనిపిస్తారు.

వరుణ్‌తేజ్?
మెగాఫ్యామిలీ నుంచి వస్తున్న అందమైన పొడుగు హిరో ఇమేజ్‌కు పూరి జగన్నాధ్ & వి.వి. వినాయక్ లతో మాస్ సినిమా చేసి వుంటే, మొదటి సినిమానే 50 కోట్లు సాధించగల సత్తా వున్న కటౌట్ వరుణ్‌తేజ్‌ది. బిడియం .. బెరుకుతనం బాగా కనిపిస్తుంది.(మొదటిసినిమా కాబట్టి ఓకే). మెగా అభిమానులకు “అబ్బా .. ఎంత బారున్నాడో కదా” .. అని చాలా సార్లు అనిపిస్తాది. ఓవర్ యాక్షన్ చెయ్యడానికి ఎక్కడా ప్రయత్నం చెయ్యలేదు. ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ సినిమా పడితే రేంజే వేరు. అందరూ ఊహించినట్టుగానే మరో సక్సస్‌ఫుల్ మెగా హిరో.

Filed Under: FeaturedHari Reviews