ముకుంద – sensational hit

Screen Shot 2014-12-11 at 9.04.53 PM

సాయి ధర్మ్ తేజ్ “పిల్లా .. నువ్వు లేని జీవితం” సూపర్ హిట్. సూపర్ హిట్ అవ్వడానికి గల కారణం సాయి ధర్మ్ తేజ్‌లో అసలు ఎక్కడా కూడా బెరుకు లేకపొవడం. రెండో సినిమా మొదటిసినిమాగా రిలీజ్ అవ్వడం పెద్ద ఎడ్వాంటేజ్ అయ్యిందని చెప్పవచ్చు.

వరుణ్ తేజ్‌లో మాత్రం చాలా బెరుకుతనం కనిపిస్తుంది. అనుకూలంగా చెప్పుకోవాలంటే ప్రెష్‌నెస్ అనుకోవచ్చు. ఏ హిరోకైనా వుంటుంది. (మొదటిసినిమాకు మాత్రమే ఆ ప్రెష్‌నెస్ వుండాలి. అదే కంటీన్యూ అయితే షెడ్‌కే అని అర్దం.)

మొదటిసినిమాకు మాత్రమే వుండే ఫ్రెష్‌నెస్ కొన్ని కథలకు బాగా నప్పుతుంది. అటువంటి కథే దర్శకుడు ఎంచుకోగల్గితే సెన్సేషనల్ హిట్ గ్యారంటీ.

అమాయకత్వం + నిజం –> ఈ రెండూ బేస్ చేసుకొని వ్రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. వరుణ్ తేజ్‌ డైలాగ్ డెలివరీ కూల్‌గా వుంది.

కుర్రోళ్ళం కదా .. ఉడుకు రక్తం .. మాకు నిద్రలు సరిగ్గా పట్టవు ..

క్లాస్ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే సినిమా. హిరోయిన్ బిగ్ ప్లస్. మంచి టాక్ వస్తే ఓవర్‌సీస్ కలక్షన్స్ అదిరిపొయే ఛాన్సస్ వున్నాయి. చిరంజీవి, పవన్‌కల్యాణ్, నాగేంద్ర బాబు & రామ్‌చరణ్ .. ఇలా అందరూ కనిపిస్తున్నారు వరుణ్ తేజ్‌లో.

Filed Under: Mega FamilyFeatured