ముగ్గురమ్మాయిలతో సత్యమూర్తి గారి అబ్బాయి

trivikram

పెద్ద హిరోలకంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే దర్శకులు వున్నారు. పూరి జగన్నాధ్ ఆ ట్రెండ్‌ను క్రియేట్ చేస్తే, రాజమౌళి & వి.వి. వినాయక్ బాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా జాయిన్ అయ్యాడు. దూకూడుతో శ్రీనువైట్ల, గబ్బర్‌సింగ్‌తో హరీష్‌శంకర్ కూడా ఇంచుమించు ఆ స్థాయికి చేరుకున్నారు.

తెలుగు తమిళ్ డబ్బింగ్ సినిమాలకు వున్న లాంటి డిమాండ్ తమిళ్‌ల్లో తెలుగు డబ్బింగ్ సినిమాలకు క్రియేట్ చేయగల్గితే, త్రివిక్రమ్ లాంటి దర్శకులకు డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం వుంది.

ఏ సెలబ్రిటికైనా ఎంతమంది అభిమానులు వుంటారో, అలానే వాళ్ళు ఏమి చేసినా విమర్శలు చేసే వాళ్ళు ఎంతో మంది వుంటారు. త్రివిక్రమ్‌కు కూడా చాలామంది వున్నారు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చెయ్యడం బాగా నేర్చుకున్నాడని అభిమానులు అంటుంటే, జ్యూస్ అయిపోయిందని విమర్శకులంటున్నారు.

We request Trivikram not to make commercial MASS movies because if he starts making those movies, we need to pack our bags..so please stick to class movies only

Tollywood NO 1 Director Raja Mouli

త్రివిక్రమ్‌ను పొగడటానికి ఒక ఆడియో ఫంక్షన్లో “ఆయన మాస్ సినిమాలు చేస్తే మమ్మలి డామినేట్ చేస్తారు” అని రాజమౌళి అనటం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పయనిస్తున్నాడు. ఇక్కడ మాస్ సినిమా అంటే ఎక్కువమందికి రీచ్ అవ్వడం.

ఎక్కువమందికి రీచ్ అవ్వాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ దండిగా వుండాలి.
1) హిరో డామినేషన్
2) ఎంటర్‌టైన్‌మెంట్
3) గ్లామర్
4) అంతర్లీనంగా చిన్న మేసేజ్ & సెంటిమెంట్

ఇద్దరమ్మాయిలతో నటించిన అల్లు అర్జున్‌ను ఇప్పుడు సత్యమూర్తి గారి అబ్బాయిగా మార్చి ముగ్గురమ్మాయిలతో నటింపజేసాడు. ఈ గ్లామర్ కచ్చితంగా కమర్షియల్ విజయానికి ఊపయోగపడుతుందంటున్నారు సినిమా ట్రేడ్ పండితులు.

Filed Under: Extended FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి