మే 15న బాహుబలి

image

తెలుగువాళ్ళు జాతీయ స్థాయిలో “ఇది మా సినిమా” అని గర్వంగా చెప్పుకునే సినిమా “బాహుబలి”. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ మరియు ఇతర భాషలలో ఈ సినిమాను మే 15న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రభాస్, అనుష్క, తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారి బడ్జెట్ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. డబ్బింగ్, రీ రికార్డింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

తెలుగులో సినిమాల సంఖ్య పెరిగింది. పోటి లేకుండా రిలీజ్ చెయ్యడానికి మంచి డేట్ దొరకటం చాలా కష్టం అయిపోతుంది.

పండగలకి పెద్ద సినిమాలకి తప్ప చిన్న సినిమాలకు ఛాన్స్ లేకుండా పోయింది.

పైరసి పెరిగిపోయింది. థియేటర్ కు వచ్చి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య తగ్గింది.

ఇన్ని ఛాలెంజేస్ ఎదుర్కొని మూడు సంవత్సరాలు షూటింగ్ జరుపుకొని తెలుగులో అత్యధిక వ్యయంతో నిర్మించిన చిత్రం “బాహుబలి”.

ఈ సినిమాను గౌరవిస్తూ ఈ సినిమాకు స్పెషల్ స్టేటస్ కలిపించవలసిన బాద్యత ప్రతి తెలుగువాడిపై వుంది.

  1. సినిమాను థియేటర్లోనే చూడాలి.
  2. ఈ సినిమా కలక్షన్స్ పై ప్రభావం చూపే మరో పెద్ద సినిమాను ఒక నెల అటూ ఇటూ రిలీజ్ చేయకూడదు.

Filed Under: Extended FamilyFeaturedTelugu