మే 2న “అ..ఆ..” ఆడియో

Share the joy
  •  
  •  
  •  
  •  

a aa

త్రివిక్రమ్ నితిన్ సమంతలు జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అ…ఆ’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రం ఆడియోని ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడియో విడుదలను మే 2వ తేదీకి వాయిదా వేశారు. హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో మే 2న సినీ ప్రముఖుల సమక్షంలో పెద్ద ఎత్తున ఆడియో విడుదలను ప్లాన్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ ఆడియో, సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ముందుగా అనురిధ్ మ్యూజిక్ అందించవలసి వుంది. అతను హ్యాండ్ ఇవ్వడంతో, మిక్కీ జే మేయర్ కు అవకాశం వచ్చింది.

ఆడియో పవన్‌కల్యాణ్ చేతుల మీదగా రిలీజ్ అవుతాదని పవన్‌ఫ్యాన్స్ ఆశీస్తున్నారు. కాకపొతే, సినిమా ప్రమోషన్ కోసం చేసే ఆడియో ఫంక్షన్ కాస్తా “పవన్‌కల్యాణ్ భజన ఫంక్షన్”గా మారుతుందని పవన్‌కల్యాణ్ రానంటున్నాడని ఫిలింనగర్ టాక్.

Filed Under: అ ఆ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *