మే 20 న ‘బ్రహ్మోత్సవం’

Share the joy
  •  
  •  
  •  
  •  

maheshbrahmotsavamfinal

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” తర్వాత మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో వస్తోన్న మా ‘బ్రహ్మోత్సవం’. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమిటంటే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని, ఆ డేట్ కోసం పని చేస్తున్నారు పెద్ద హిరోలంతా. ఆ విధంగా మే 20 న రిలీజ్ చేద్దామనుకున్నాడు మహేష్‌బాబు. ఈ చిత్రం ఆడియోను మే 7న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు.

మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

ఈ చిత్రంలోని ఓ పాటను మంగళవారం విడుదల చేశారు. ‘వచ్చింది కదా అవకాశం..’ అంటూ సాగే ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, అభయ్‌ జోద్పూర్‌కర్‌ గానం చేశారు.

మే 20 న ‘బ్రహ్మోత్సవం’ వస్తే, త్రివిక్రమ్ “అ .. ఆ” జూన్ నెలలోకి వెళ్ళిపొయే అవకాశాలు వున్నాయి.

Filed Under: Featuredబ్రహ్మోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *