మే 6న సుప్రీమ్

Supreme

idlebrain jeevi ‏@idlebrainjeevi
It’s going to be Suriya – Vikram Kumar’s 24 versus Sai Dharam Tej – Anil Ravipudi’s Supreme on 6 May

సర్దార్ గబ్బర్‌సింగ్ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం అటు పవన్‌కల్యాణ్‌కు గాని, పవన్‌ఫ్యాన్స్‌కు గాని ఎటువంటి నిరుత్సాహాన్ని కలుగజేయలేదు. ఆవేశంతో ప్రిమియర్ షోస్ చూసిన అభిమానులే భారీగా నిరుత్సాహ పడ్డారు. పవన్‌కల్యాణ్ ఇంటర్వ్యూస్‌తో ఆ నిరుత్సాహాన్ని బ్యాలెన్స్ చేసేసాడు. పవన్‌కల్యాణ్ మీద నమ్మకంతో, సర్దార్ గబ్బర్‌సింగ్ వలన ఫైనాన్షియల్‌గా భారీగా నష్టపొయిన డిస్ట్రీబ్యూటర్స్‌ను కూడా పవన్‌కల్యాణ్ ఆదుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సర్దార్ గబ్బర్‌సింగ్ ఎవరికీ నష్టం కలుగజేయలేదని అర్దం అవుతుంది.

పవన్‌కల్యాణ్ రెండు సంవత్సరాలు పైనే టైం వేస్ట్ చేసుకొని ఎంతో కష్టపడి సెట్స్ మీదకు తీసుకెళ్ళిన సర్దార్ గబ్బర్‌సింగ్, తన ఆలోచనలకు దూరంగా రూపుదిద్దుకుంటున్నదన్న విషయం లేటుగానైనా గ్రహించిన పవన్‌కల్యాణ్, 70% సినిమాను మూడు నెలల్లో చుట్టేసి, మరింత టైమ్ వేస్ట్ చేసుకొకపొవడం ఆనందించవలసిన విషయం అని పవన్‌ఫ్యాన్స్ అంటున్నారు.

సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాప్ ప్రభావం సరైనోడుపై పడింది. ఆ సినిమా హిట్ అయ్యివుంటే, ఉత్సాహంతో సరైనోడు చూసేవారు. ఆ సినిమా ఫ్లాప్ వలన, ఈ సినిమా బాగుంటే చూద్దాంలే అని అనుకొవడంతో ఓపినింగ్స్ తగ్గాయి. మాస్ సినిమాకు తోడు ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో సరైనోడు B & C సెంటర్స్‌కే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వెబ్‌లో ఫ్లాప్ టాక్‌తో(ఓవరాల్ సినిమాగా బాగో లేదు) పాటు “అల్లు అర్జున్ బాగా చేసాడు. పాటలు బాగున్నాయి. చత్రపతి లాంటి ఇంటర్వెల్ సీన్స్ రెండు మూడు వున్నాయి.” అని కొద్దిగా పాజిటివ్‌గా కూడా చెపుతున్నారు.

ఆ రెండు సినిమాల ఫ్లాప్ ప్రభావం మరో మెగా మూవీ “సుప్రీమ్” పడనుంది. మాటల హైప్‌ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. సినిమాకు ముందే కంటెంట్ రిలీజ్ చేసేసి హైప్ చేద్దామనుకుంటే అది మరో పెద్ద తప్పిదం అవుద్ది. ఈ పరిస్థితుల్లో సినిమాలో విషయం వుంటే మినహా వేరే దిక్కు లేదు. దీనికితోడు మనం ఫేం విక్రమ్ & సూర్య కాంబినేషన్‌లో వస్తున్న 24 కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. సుప్రీమ్ ఏ రేంజ్‌లో సాయిధర్మ్‌తేజ్‌కు ప్లస్ సినిమా అవుద్ది, దిల్ రాజు కోరుకుంటున్న కలక్షన్స్ సాధిస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం.

Supreme

Filed Under: Featuredసుప్రీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *