మొదటి సినిమాతోనే 50 కోట్లు

akhil

తెలుగుసినిమా స్టామినా చూపించిన సినిమా బాహుబలి. ఎవరి ఊహలకు అందనంత కమర్షియల్ రేంజ్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు గుర్తించే సినిమా తీయ్యాలే కాని, ప్రేక్షకులు సినిమాను ఎంత గౌరవిస్తారో ఆదరిస్తారో బాహుబలి ద్వారా తెలిసింది. బాహుబలి ఇచ్చిన మూమెంట్‌ను నిలబెట్టుకొవాల్సిన బాద్యత ప్రతి తెలుగుసినిమాపై వుంది. మహేష్‌బాబు “శ్రీమంతుడు” కచ్చితంగా నిలబెడుతుంది. అఖిల్ అక్కినేని మొదటి సినిమా కూడా మంచి కమర్షియల్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

అక్కినేని ఫ్యామిలి వారి “మనం” సినిమా అంతా ఒక ఎత్తు. అఖిల్ ప్రెజెన్స్ ఒక ఎత్తు. అఖిల్ అక్కినేని మొదటి సినిమాకు డైరెక్టర్ గా వివి వినాయక్ ను ఎంచుకొని మంచి పని చేసాడు. మొదటి సినిమాతోనే 50 కోట్లు షేర్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినాయక్ నితిన్‌తో తీసిన “దిల్” సినిమా మాదిరి కొద్దిగా కొత్తదనం చూపించ గల్గితే చాలు, కలక్షన్స్ సంగతి అఖిల్ చూసుకుంటాడు.

ఈ సినిమా ద్వారా అఖిల్ తో పాటు బాలీవుడ్ భామ సయేషా సైగల్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కానుంది. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ రాస్తున్నాడు. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. అఖిల్ మొదటి సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్ ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

ఇంచుమించు ఇంతే స్టామినా కలిగిన నాగేంద్రబాబు తనయుడు “వరుణ్ తేజ్” ను మాస్ దర్శకుడి చేతిలో పెట్టకుండా క్లాస్ దర్శకుడి చేతిలో పెట్టి, 10 కోట్ల షేర్‌తో సరిపెట్టుకున్నారు.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *