మొదలయ్యింది

my name is raju

kona venkat ‏@konavenkat99
Very pleasant & positive vibes at the opening of Ramcharan movie.. A mega entertainer is guaranteed on 15th October !!

గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత రామ్‌చరణ్ మళ్లీ షూటింగ్‌లతో బిజీ అవుతున్నాడు. శ్రీనువైట్ల-రామ్ చరణ్ కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మించే సినిమా షూటింగ్ లాంఛనంగా గురువారం ఉదయం ప్రారంభమైంది. చిరంజీవి..సురేఖ, మాస్ డైరక్టర్ వివి వినాయక్ హాజరయ్యారు. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై నిర్మించే ఈ సినిమాకు దేవుని ఫోటోలపై మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గారు క్లాప్ కొట్టగా మెగాస్టార్ చిరంజీవి చిత్రం స్రిప్ట్ ను దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత దానయ్య డి.వి.వి.లకు అందజేశారు . దర్శకుడు వి.వి.వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ‘రామ్ చరణ్’, నాయిక ‘రకుల్ ప్రీత్ సింగ్’ ల తో పాటు భారీ తారాగణం , అత్యున్నత సాంకేతిక విలువలతో తమ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభమౌతుంది.

దర్శకుడు ‘శ్రీను వైట్ల’ మాట్లాడుతూ “ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. . కథ చాలా బాగా వచ్చిందని, రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లతో తన కాంబినేషన్ లో మళ్లీ సినిమా చేయడం సంతోషంగా వుందని అన్నారు.

రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ ” శ్రీను చెప్పినట్టు ఒక అద్భుతమైన కథ ఈ సినిమాకి కుదిరిందని, కొంత గాప్ తర్వాత మళ్ళీ తాము ఈ ప్రాజెక్ట్ కోసం కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని. మొదటి సారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

గోపి మోహన్ మాట్లాడుతూ శ్రీను వైట్లతో మళ్ళీ కలిసి పని చెయ్యటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి మాట్లాడుతూ అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చక్కని ప్లానింగ్ తో జరుగుతాయని తెలిపారు.

Filed Under: Mega FamilyFeaturedTelugu