రాంగోపాలవర్మ పిరికోడు(కాని తెలివైనోడు)

ram-gopal-varma-my-next-films-name-is-vangaveeti

కొన్ని అబద్దాలకు, కొన్ని నిజాలకు, తన అభిప్రాయాలను బాగా మిక్స్ చేసి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్దం చేసుకొనేలా వ్యక్తపరచగల వ్యక్తి రాంగోపాలవర్మ.

వంగవీటి సినిమా తీస్తాడో లేదో తెలియదు కాని, మీడియా చేత బాగా హాడావుడి చేయిస్తున్నాడు. ఈ సందర్భంగా “రాంగోపాలవర్మ పిరికోడు. నిజంగా ధైర్యం వుంటే బలవంతుల దౌర్జన్యలపై స్టడీ చేసి వాళ్ళపై సినిమా తీయ్యాలి. కాని చేతులేత్తేసి చల్లారిపోయిన వంగవీటి ఫ్యామిలీపై సినిమా తీస్తే, ఎవడు తిరగబడతాడు? తిరగబడటానికి ఎవరున్నారు?” అనే కామెంట్స్ బెజవాడ వాసుల నుంచి వినిపిస్తున్నాయి.

రాంగోపాలవర్మ పిరికోడు అయినా తెలివైనోడు. పిరికితనంతో కూడిన తెలివి అంటే ఉదాహరణలు ఇవి:

  1. బ్రూస్‌లీ సినిమా చూడకుండానే, రెండు సార్లు చూసానని చెప్పాడు. అత్యద్బుతంగా వుందని కామెంట్ చేసాడు. డైరక్ట్‌గా శ్రీనువైట్లను విమర్శించే ధైర్యం లేదు.
  2. కేసీఆర్ శ్రీదేవి కంటే అందగాడని పొగిడాడు. ఇది ఇంకా దారుణం. అది కచ్చితంగా వెటకారమే అని అర్దం అవుతున్నా, దాని అర్దం ఎవరికీ తెలియదు. కేసీఆర్ ను విమర్శించే ధైర్యం లేదు. స్వర్గీయ వైయస్సార్ చనిపొయాక, “రెడ్డిగారు పోయారు” తీస్తానన్నట్టు, కేసీఆర్ వర్గం వీక్ అయ్యాక “కేసీఆర్” అని సినిమా తీస్తానంటాడు.

తెలివైనోడు అనటానికి ఇంకో మంచి ఉదాహరణ:
రక్తచరిత్ర సినిమా కోసం పరిటాల రవి పవన్‌కల్యాణ్ గుండు కొట్టించాడనే పుకారును చిత్రీకరించి, స్టిల్స్ రిలీజ్ చేసి, జనాలను డైవర్ట్ చేసి, ఫైనల్‌గా స్వర్గీయ ఎన్.టి.ఆర్ ను తక్కువ చేసి చూపించాడు.

bottomline:

  1. “బెజవాడ రౌడీలు” అని మొదలుపెట్టి టైటిల్ మార్చినట్టుగానే “వంగవీటి” టైటిల్ మార్చి ఎదో టైటిల్‌తో సినిమా తీస్తాడు.
  2. “రెడ్డిగారు పోయారు” టైపులో “వంగవీటి” అని టైటిల్ తోనే సినిమా ఆపేయవచ్చు.
  3. “కిల్లింగ్ వీరప్పన్” తరహాలో, వేరో కోణంలో చూపిస్తాడు.
  4. “రక్త చరిత్ర” టైపులో ఎవరిని తక్కువ చేయకుండా రౌడీయిజం హిరోయిజం అన్నట్టు తీస్తాడు.
  5. వంగవీటి ఫ్యామిలీ ప్రధాన ప్రత్యర్ది దేవినేని నెహ్రూ ఇంకా స్ట్రాంగ్‌గా వున్నాడు కాబట్టి, నిజాలు చెప్పే ధైర్యం రోంగోపాలవర్మకు లేదు.
  6. అటు మీడియాకు, ఇటు జనాలను కొన్ని రోజులు మంచి సందడి.
  7. వీడు మన మీద ఎప్పుడు పడతాడోనని రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెట్టేలా చేస్తున్నాని రాంగోపాలవర్మ మనసులో అనుకుంటూ వుంటాడు.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *