రాక్‌స్టార్‌గా మహేష్ బాబు

1

2014లో సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు హీరోగా నటించిన ’1-నేనొక్కడినే’ సినిమా కూడా ఒకటి. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరగనుంది.

ఈ సినిమా ఆడియో కోసం యావత్ తెలుగుసినిమా లోకం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ చిత్ర ఆడియోని డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా ఆడియో వేడుకకి సంబందించి ఓ ఆడియో టీజర్ ని ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేసారు. ఈ టీజర్ లోరాక్‌స్టార్‌గా మహేష్ బాబు కనిపించాడు. సరికొత్త మహేష్‌బాబును చూడబోతున్నాం అన్న ఫీలింగ్ తో పాటు దేవిశ్రీ-సుకుమార్ కాంబినేషన్ బెస్ట్ అనిపించింది.

Filed Under: Extended FamilyFeatured