రాజమౌళికి ఇంత రిస్క్ అవసరమా?

Rajamouli

రాంగోపాలవర్మ
త్రివిక్రమ్ శ్రీనివాస్
శ్రీను వైట్ల
సుకుమార్
పూరి జగన్నాధ్
సురేందర్‌రెడ్డి
మలినేని గోపి
బోయపాటి శ్రీను
వి.వి. వినాయక్
హరీష్‌శంకర్
కృష్ణవంశీ
కొరటాల శివ
వంశీ పైడిపల్లి

ఇలా ప్రతి ఒక్కరూ .. సినిమా దర్శకత్వంలో పండిపొయారు. రాజమౌళి వీళ్ళ కంటే పెద్ద గొప్పొడు ఏమీ కాదు, కాని బాహుబలి ప్రి రిలీజ్ చూస్తే, చిరంజీవి మాదిరి నెంబర్ 1 to 10 రాజమౌళి అన్న ఫీలింగ్ వచ్చింది. కారణం 10 కోట్లతో సినిమా తీసి 50 కోట్లు రాబట్టగల సత్తా వుండి, 250 కోట్లతో సినిమా తీసి, ఆ సినిమా కోసం మూడు సంవత్సరాలు పైగా స్పెండ్ చేసాడు. ఎన్ని డబ్బులొస్తాయో ఎవరికీ తెలియదు. చాలా పెద్ద రిస్క్.

రాజమౌళికి ఇంత రిస్క్ అవసరమా? .. బాహుబలి ప్రి రిలీజ్ హైప్ అయితే వచ్చింది, దానికి తగ్గట్టు ఓపినింగ్స్ కూడా వచ్చాయి. బాహుబలి పూర్తిగా ఫెయిల్ కాకపొయినా, హైప్ నిలబెట్టుకొవడంలో ఫెయిల్ అయ్యింది.

రెండు మూడు సంవత్సరాలు సెట్స్ మీద గడిపే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా, పూర్తిగా మారిపోయి .. ఆరు నెలల్లో సినిమా కంప్లీట్ చేసేసి క్విక్ మనీ కూడబెట్టుకుంటున్నాడు. వి.వి. వినాయక్ మొదటి నుంచి ఇప్పటి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాదిరే వున్నాడు. పూరి జగన్నాధ్ కు ఎవరూ సాటి రాలేరు. రివర్స్‌లో కొద్దిగా స్లోగా చెయ్యండని పూరిని రిక్వెస్ట్ చెయ్యాలి. శ్రీనువైట్ల కూడా ఫాస్ట్‌గానే తీస్తాడు.

బాహుబలి-1 అనుభవం రాజమౌళిలో ఎటువంటి మార్పును తీసుకొస్తుందో చూడాలి.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *