రాజమౌళిని ఫాలో అవుతున్న నాగార్జున

Nag

కష్టపడితే సరిపోదు. ఆ కష్టానికి తగ్గ ఫలితం సాధించాలి. అప్పుడే ఆ కష్టానికి ఒక అర్దం వుంటుంది. సినిమా తీసామా, జనాల మీదకు వదిలామా, నాలుగు డబ్బులు వెనుకేసుకున్నామా అని కాకుండా, ఏ పాయింట్ మీద సినిమా తీసామో, ఆ పాయింట్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా పబ్లిసిటీ చెయ్యాలి. భారీ ఓపినింగ్స్ కోసం ఎంత హైప్ చేయగల్గితే అంత చెయ్యాలి.

రాజమౌళి సినిమా కోసం ఎంత కష్టపడతాడో, సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వడానికి అంత కన్నా ఎక్కువ కష్టపడతాడు. బాహుబలి కలక్షన్స్ ఆ విధంగా వుండటానికి కారణం ప్రతి తెలుగోడిని బాహుబలి తమ సొంత సినిమా అనుకునే విధంగా చేయగల్గాడు.

మగధీర, మర్యాద రామన్న, ఈగ సినిమాలకు ఇంకో రకమైన వ్యూహం ఆచరించాడు. సినిమా కథ మొత్తం సినిమా రిలీజ్‌కు ముంచే రివీల్ చేసేయటం. ఇప్పుడు నాగార్జున కూడా అదే వ్యూహాన్ని ఫాలో అవుతున్నట్టు వున్నాడు. పబ్లిసిటీలో భాగంగా సొగ్గాడే చిన్ని నాయనా సినిమా మెయిన్ పాయింట్ రివీల్ చేసేసాడు.

ఇప్పుడు ఊపిరి సినిమా పబ్లిసిటీ విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నాడు. మొత్తం సినిమా చిన్న ట్రైలర్‌లో చేప్పేసాడు.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *