రాజమౌళి ఒప్పుకోవలసిన అవసరం ఏమిటి?

Bahubali-Rajamouli

ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని ఆఫీషియల్‌గా ఎనౌన్స్ చేసే టాలీవుడ్ సంస్థలు లేవు. కాని ఎవరి సినిమా ప్రమోషన్ కోసం ఆ సినిమాల నిర్మాతలు మా సినిమా ఇండస్ట్రీ హిట్ అని ఎనౌన్స్ చేసుకొవడం మాములే. ఆ స్టేట్‌మెంట్స్ బేస్ చేసుకొని అభిమానులు నిరవరధికంగా మా హిరో సినిమా గొప్పంటే మా సినిమా గొప్పని వాదించుకొవడం కూడా మాములే.

ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పవలసిన బాద్యత మీడియాపై వుంది. అది పూర్తిగా కాకపొయినా, కొంతవరకు నిజాయితీగానే వుందని చెప్పవచ్చు.

పోకిరి సినిమాను మగధీర దాటినప్పుడు, పోకిరి దర్శకుడు పూరి జగన్నాధ్ ఒక టి.వి లైవ్ షోలో చాలా పెద్ద మార్జిన్‌తో మగధీర సాధించినట్టుగా ఒప్పుకొని, ఆశ్చర్యాన్ని కలిగించాడు.

ఇప్పుడు మగధీర దర్శకుడు రాజమౌళి, అత్తారింటికి దారేది సినిమా మగధీరను దాటి ఇండస్ట్ర్ హిట్‌గా నిలిచందని ట్వీట్ చేసి మరింత ఆశ్చర్యానికి గురి చేసాడు.

రాజమౌళి ఒప్పుకోవలసిన అవసరం ఏమిటి?
అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యినందుకు మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మిగతా వాళ్ళు ప్రతిసినిమాకు చేసే హాడావుడే కదా అని లైట్ తీసుకున్నారు.రాజమౌళి స్టేట్‌మెంట్‌తో ఫ్యాన్స్ చేసుకునే సంబరాలు నిజమేనని అందరికీ తెలిసింది. Thanks to Rajamouli Sir.

మన అభిమాన హిరో కాదని మనం చేసే మొండి వాదన కరెక్ట్ కాదు, మనం చేసే వాదనలో నిజాయితీ వుండాలి, రికార్డ్ ఎవరు క్రియేట్ చేసినా రికార్డే.

అత్తారింటికి దారేది వంద కోట్లు థియేటర్ షేర్ సాధించడం కష్టం అంటున్నారు.

రామ్‌చరణ్ ఎవడు సాధిస్తుందెమో చూద్దాం.
or
లేదా మహేష్‌బాబు ‘1’ సాధిస్తుందెమో చూద్దాం.

ఆ రెండు సినిమాలు సాధించకపొతే,
రాజమౌళి బాహుబలి కచ్చితంగా సాధిస్తుందని ట్రేడ్ పండితులు ఎప్పుడో ఫిక్స్ అయిపొయారు. (only telugu version)

PS:అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

Filed Under: Pawan KalyanFeatured