రామ్‌చరణ్ డిఫరెన్స్ మేక్ చేయగలడా?

నెం 1 కమర్షియల్ హిరో

నెం 1 కమర్షియల్ హిరో

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో లేని లోటును ఆయన వారసుడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ భర్తీ చేశాడు. ఎక్కడా మెగా అభిమానులను నిరాశపరచకుండా దూసుకుపోతున్నాడు అనడంలో సందేహం లేదు. మగధీర చిత్రంతో తెలుగు చలన చిత్ర రికార్డులను ఏరి పారేసిన రామ్‌చరణ్, రచ్చ, నాయక్ & ఎవడు సినిమాలతో నెం 1 కమర్షియల్ హిరోగా స్థిరపడి పొయాడు

ఒకప్పుడు క్రియేటివిటీ దర్శకుడిగా పేరొంది ఇప్పుడు ప్రేక్షకుల పాలిట ఒక శాపంగా మారిన కృష్ణవంశీ, మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన దర్శకుడు కావడం వలన ఆయనతో రామ్‌చరణ్ సినిమా చెయ్యడం తప్పడం లేదు.

కృష్ణవంశీని రామ్‌చరణ్‌తో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుందని అడిగితే “పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చాలా గొప్ప సినిమా అవుతుంది. ఆ వైబ్రేషన్స్ ముందే కనిపిస్తున్నాయి.” అని అంటున్నాడు.

కృష్ణవంశీ ఊహిస్తున్నట్టు రామ్‌చరణ్ డిఫరెన్స్ మేక్ చేయగలడా?

Filed Under: Mega FamilyFeatured