రామ్‌చరణ్ కౌంటర్ ఎటాక్ కోసం ఎదురుచూస్తున్న మీడియా

anjanaproductionsno7_079

so called grt directors 1s are confined to only speeches and lectures on stage nowadays.its sad they cant move anyting but their mouth. — ram charan

మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి దాసరి నారాయణరావు అప్పుడెప్పుడో చేసిన ఇండైరక్ట్ కామెంట్స్‌కు ధీటుగా రామ్‌చరణ్ ఘాటుగా పై విధంగా స్పందించాడు.

పబ్లిక్‌కు తెలిసినంత వరకు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ అని రెండు మూడు నెలల క్రితమే ఎనౌన్స్ చేసారు. ఆ డేట్‌కు థియేటర్స్ బుక్ చేసుకున్నారు. లోపల ఏమి తర్జనా భర్జనా పడ్డారో పబ్లిక్‌కు తెలియదు. దాసరి చెప్పినట్టు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా కోసం మిగతా సినిమా ప్రొడ్యుసర్స్‌ను నిజంగా టార్చర్ చేసారో లేదో ఆ నలుగురికే తెలియాలి. ఇక్కడ జోక్ ఏమిటంటే ఆ నలుగురిలో దాసరి ఒకడు.

40 కోట్లకు పై వసూళ్ళు చేసిన సినిమా మూడు రోజులు సినిమా అని అనడం హాస్యాస్పందం. రన్నింగ్‌లో వున్న సినిమాను కామెంట్ చెయ్యకూడదని మొన్న ప్రకాష్ రాజుకు క్లాస్ పీకిన డైరక్టర్స్ అస్సోసియేషన్ దాసరి కామెంట్స్‌కు ఏమి సమాధానం చెపుతుందో చూడాలి.

నిన్న దాసరి చేసిన కామెంట్స్‌కు సమాధానంగా రేపు 25న జరగబోయే సాయి ధర్మ్ తేజ్ ‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా దాసరినే ఆహ్వానించి సన్మానం చేస్తారో లేదా రామ్‌చరణ్ మరింత ఘాటుగా స్పందిస్తాడో నని మీడియా ఎదురుచూస్తుంది.

సాయి ధర్మ్ తేజ్ ‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ సినిమా ప్రమోషన్ కోసం ఎంచుకున్న వేదికను కంపు చేయకుండా, తన మీద రాళ్ళు వేయించుకోవడంలో ఆరితేరిన చిరంజీవి లైటుగా తీసుకొని రామ్‌చరణ్‌ను కంట్రోల్ చేసేస్తాడని మెగా అభిమానులు ఊహిస్తున్నారు.

వెంటనే కాకపొయినా దాసరి కామెంట్స్‌కు ఘాటుగా మెగాఫ్యామిలీ సమాధానం ఇవ్వాలని ఒక మెగా అభిమానులువర్గం కోరుకుంటుంటే, మరో పక్క మౌనంగా వుండటమే బెటరని వేరే మెగా అభిమానులువర్గం కోరుకుంటుంటున్నారు.

ఎవరి కోరికలు ఎలా వున్నా, మీడియానూ తన వైపు తిప్పుకొవడంలో దాసరి తర్వాతే ఎవరైనా . he is great.

Filed Under: Mega Family