రామ్‌చరణ్ నెం 1

ram charan number one

SKN ‏@SKNonline

In 83 yrs #Telugucinema #RamCharan is the 1st & Only hero have 5 films (8 films career) did mre dan 40crs. #MD #Racha #Naayak #Yevadu & #GAV

పలానా హిరో నెం 1 హిరో అని ఎవరో ఒకరు లేదా ఎదో ఒక వర్గానికి చెందిన మీడియా డిక్లేర్ చేస్తే ఆ హిరో నెం 1 హిరో అయిపోడు. అలానే నెం 1 క్వాలిఫికేషన్స్ కలిగిన హిరోను ఎవరూ సప్రెస్ చెయ్యలేరు అని చిరంజీవి నిరూపించాడు.

“ఇప్పుడు రామ్ చరణ్ కు టాలీవుడ్ నెం 1 హిరో క్వాలిఫికేషన్స్ వున్నాయా?” అంటే నెం 1 క్వాలిఫికేషన్స్ ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది.

1) “అత్తారింటికి దారేది” వచ్చేదాకా బిగ్గెస్ట్ టాలీవుడ్ హిట్ ‘మగధీర’
2) తాను చేసిన ఏడు తెలుగు సినిమాల్లో ‘ఆరెంజ్’ ఒకటే కమర్షియల్ ఫ్లాప్.
3) మంచి పేరున్న దర్శకులతో మాత్రమే కాదు, కొత్త దర్శకులతో కూడా మంచి కలక్షన్స్ సాధించగలను అన ‘రచ్చ’తో నిరూపించాడు.
4) వినాయక్ లాంటి మాస్ దర్శకుడు తోడైతే తన బిజినెస్ స్టామినా ఏమిటో, ‘నాయక్’ తో నిరూపించాడు.
5) అన్నిటి కంటే ముఖ్యమైనది: తాను చేసే సినిమాపై రామ్ చరణ్ చూపించే శ్రద్ధ మరియు ప్రేక్షకులకు ఎదో ఇవ్వాలని ఆత్రం.
6) S/O చిరంజీవి అవ్వడం ఒక బరువైన బాద్యత అని చిన్న వయసులోనే తెలుసుకోవడం మరియు రెస్ట్ లేకుండా సినిమా కోసమే రేయింబవళ్ళు కష్టపడటం..
7) ఏ దర్శకుడి పేరు చెపితే నిర్మాతలు తమ సెల్ ఫోన్లు స్విచాఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపొవడం మొదలుపెట్టారో, ఏ దర్శకుడి సినిమా అంటే ఆ సినిమా హాలు దరిదపుల్లోకి వెళ్ళడానికే ప్రేక్షకులు భయపడటం మొదలైందో, ఆ దర్శకుడు కృష్ణవంశీతో “గోవిందుడు అందరివాడేలే” లాంటి కమర్షియల్ హిట్ సాధించడం ఆషామాషీ కాదు.

అందుకే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపొయినా రామ్‌చరణ్ టాలీవుడ్ నెం 1 కమర్షియల్ హిరో.

పవన్‌కల్యాణ్ & మహేష్‌బాబు మాదిరి ప్రి రిలీజ్ హైప్ కూడా క్రియేట్ చేయగల్గితే, అందరి హిరో అభిమానులు ఏకగ్రీవంగా రామ్‌చరణ్ నెం 1 హిరో అని ఒప్పుకుంటారు.

Filed Under: Mega Family