రామ్‌చరణ్ తండ్రిగా రజనీకాంత్

rc-rk

తెలుగు చిత్ర సీమలో ముల్టీ స్టారర్ చిత్రాలు ఊపందుకుంటున్న క్రమంలో, మెల్ల మెల్లగా మంచి మంచి కాంబినేషన్స్ తో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే వెంకటేష్-మహేష్, వెంకటేష్-రామ్, అల్లుఅర్జున్-రామ్‌చరణ్ ఇలాంటి ఊహించని కాంబినేషన్స్ లో చిత్రాలు రావడంతో ఈ పద్దతిని మరింత ముందుకు తీసుకెళ్ళాలని మన దర్శకులు వ్యూహాలు రచిస్తున్నారు. దానిలో భాగంగా ఈ మధ్యనే మొదలైన రామ్‌చరణ్-కృష్ణవంశీ కొత్త చిత్రంలో, అన్న పాత్రలో శ్రీకాంత్ ను తీసుకోగా, రామ్‌చరణ్ నాన్న పాత్రలో రజనీకాంత్ నటించనున్నట్లు సినివర్గాలు చెబుతున్నాయి.

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందు రానుంది.

Filed Under: Mega FamilyFeatured