రావు రమేష్

Rao-Ramesh

అత్తారింటికి దారేది రిలీజ్ అయిన కొత్తలో ఇండస్ట్రీ హిట్ అయ్యేంత కథా బలం సినిమాలో లేదన్నారు. త్రివిక్రమ్ స్మూత్ టేకింగ్ కు పవన్ స్టామినా తోడయ్యి అందరి అంచనాలను తారుమారు చేసింది. సినిమాలో మరిచిపొలేని సీను రావు రమేష్ హార్ట్ ఎటాక్ గురుంచి ఎక్సప్లైన్ చేసే సీను. ఆ సీనును త్రివిక్రమ్ సృస్టిస్తే, రావు రమేష్ ప్రాణం పొసాడు.

ఒకప్పుడు మన దర్శకులు తమ సినిమాలలో ప్రకాష్ రాజ్ కోసం ప్రత్యేకంగా ఒక పాత్ర క్రియేట్ చేసేవారు. ఆ పాత్రలు చూసి ఆయనకే ఎందుకు క్రియేట్ చేస్తున్నారు.. మాకెందుకు చెయ్యడం లేదని తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఈర్ష్య పడిన రోజులు కూడా వున్నాయి.

ఇప్పుడు మన దర్శకులు రావు రమేష్ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేస్తున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే తనకు ఇచ్చిన పాత్రను రక్తి కట్టించడంలో రావు రమేష్ సూపర్ సఫలీకృతుడవుతున్నాడు అనవచ్చు.

ఈ ట్రైలర్‌లో రావు రమేష్ ను చూస్తుంటే అత్తారింటికి దారేది సీను గుర్తుకు వస్తుంది.. Hats off to రావు రమేష్ and our Directors.

Filed Under: Extended FamilyFeatured