రిలీజ్ డేట్ రాజీ కోసం పంపించిన అల్లు అరవింద్

Chiru at SGS Shooting Spot

హైదరాబాదులో వేసిన విలేజ్ సెట్‌లో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి విజిట్ చేసారు. పవన్ కళ్యాణ్తో పాటు యూనిట్ సభ్యులతో సరదాగా గడిపిన మెగాస్టార్, అభిమానులతో పాటు యూనిట్ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. చిరు, పవన్తో పాటు ఇతర యూనిట్ సభ్యులు కలిసి దిగిన ఫోటోను నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

అసలు న్యూస్‌కు కొద్దిగా స్పైస్ లేదా వెటకారం జోడిస్తే అందరూ ఆసక్తిగా చదువుతారనేది మీడియా అభిప్రాయం. కొన్నిసార్లు అది హద్దులు దాటి, గందరగోళంతో పాటు విరక్తి కూడా కలిగిస్తూ వుంటుంది.(అది వేరే విషయం.)

1) సరైనోడు ఏప్రిల్ 8. సర్దార్ గబ్బర్‌సింగ్ ఏప్రిల్ మొదటి వారం అని తమ తమ సినిమా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసారు ఆ సినిమా యూనిట్స్. 2)అల్లు అరవింద్‌ను చిరంజీవి గుడ్డిగా ఫాలో అవుతాడని, మనకు నచ్చని చిరంజీవి నిర్ణయాలకు అల్లు అరవింద్‌ను తిట్టడం మెగా అభిమానులు చేసే పని అయితే, చిరంజీవి సక్సస్‌కు అల్లు అరవిందే కారణం అని కొందరు చిరంజీవి అభిమానులను ఆటపట్టించటం సాధారణ విషయాలు.

పై రెండు పాయింట్స్ తీసుకొని pawanfans.com వంతుగా, చిరంజీవిని రిలీజ్ డేట్ రాజీ కోసం పంపించిన అల్లు అరవింద్ అని ప్రచారం చేస్తే పోలే అని సరదాగా వంకరగా వ్రాయటం జరిగింది. వేరే మీడియల్లో ఏమేమి వస్తుందో చూడాలి.

Filed Under: Just4Funసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *